రంగంలోకి దిగిన సాయి ధరమ్..!

  • August 31, 2020 / 06:31 PM IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్. దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు సాంగ్స్ విడుదల కాగా విశేష ఆదరణ దక్కించుకున్నాయి. ఇస్మార్ట్ శంకర్ లో హీరోయిన్ గా నటించిన నభా నటేష్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే ఈ చిత్రం చాల వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. కాగా నేడు ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం.

లాక్ డౌన్ వరకు ఈ చిత్ర షూటింగ్ నిరవధికంగా జరిగింది. లాక్ డౌన్ కారణంగా ఐదునెలలుగా షూటింగ్ కి బ్రేక్ పడగా తిరిగి నేడు మొదలవుతుంది. ఇక ఈ చిత్రాన్ని ఓటిటి లో విడుదల చేస్తున్నారంటూ బాగా ప్రచారం జరిగింది. మరికొద్దిరోజులలో థియేటర్స్ పునఃప్రారంభం కానున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేసే అవకాశం కలదు.

సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక గత ఏడాది చివర్లో ప్రతిరోజూ పండగే చిత్రంతో వచ్చిన సాయి ధరమ్ భారీ విజయాన్ని అందుకున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ తరువాత ధరమ్ ప్రస్థానం ఫేమ్ దేవా కట్టాతో చేయనున్నారు.

34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!
సౌత్ లో అత్యధిక పారితోకం అందుకునే సంగీత దర్శకులు వీరే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus