‘ప్రాజెక్ట్ కె’ కాస్త ‘కల్కి 2898 AD’గా మారిపోయి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకునే అంశంగా మారిపోయింది. దర్శకుడు నాగ్ అశ్విన్… ప్రభాస్‌ను ఎలా చూపిస్తారు అనే చర్చ మొదలై.. ఇప్పుడు రుచి బాగుంది… అసలైన వంటకం ఇంకా బాగుండాలి అనేలా మారిపోయింది డిస్కషన్. అయితే ఈ డిస్కషన్ మరికొన్ని ఆసక్తికర అంశాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి ప్రముఖ దర్శకుడు రాజమౌళి రెయిజ్ చేయగా… మరికొన్ని అభిమానులు సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
‘కల్కి 2898 AD’ ఫస్ట్ గ్లింప్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిన విషయం తెలిసిందే. కలర్, ఆ సెటప్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి అంటున్నారు. అయితే అందులో మన నేటివిటీ ఉంటే.. ఇక ‘కల్కి 2898 AD’ను ఆపేవారు లేరు అని ఆకాశానికెత్తేస్తున్నారు అభిమానులు. అయితే ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేస్తారని ప్రచారం జరుగుతోంది. నిర్మాత అశ్వనీదత్ ప్లాన్ కూడా అదే అంటున్నారు. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమాను ఒక పార్టుగా రిలీజ్ చేస్తే ఆశించినంత లాభాలు రావని అనుకుంటున్నారని టాక్.
అదే రెండు భాగాలైతే బాగుంటుందని అనుకుంటున్నారట. అయితే ఈ నిర్ణయం ఇంకా పూర్తి స్థాయిలో తీసుకోలేదేమో అనిపిస్తోంది. ఎందుకంటే మొన్న రిలీజ్ చేసిన ‘కల్కి 2898 AD’ టైటిల్‌లో ‘సలార్’ తరహాలో పార్టులు విభజించలేదు. ‘కల్కి 2898 AD’ కథని ప్రారంభిస్తున్నప్పుడు రెండు భాగాల ఆలోచన లేదు. ఇప్పుడు ఆ దిశగా తర్జన భర్జనలు జరుగుతున్నాయట. ఇక ఈ సినిమాను 2024 సంక్రాంతికి విడుదల చేస్తారని తొలుత చెప్పారు. కానీ వీడియోలో ఇయర్ మాత్రమే చెప్పారు.
అలా రిలీజ్ డేట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పాలి. ఇంత పెద్ద (Kalki Movie) సినిమాను ఎలాంటి పోటీ లేని సమయంలో రిలీజ్ చేయాలని అనుకోవడమే డేట్‌ను చెప్పకపోవడానికి కారణం అని అంటున్నారు. అలాగే రెండు భాగాలు చేసినప్పుడు డేట్ ఇప్పుడే చెబితే.. రెండో పార్టు ప్రారంభం వివరాలు కూడా చెప్పాలి. ఇలానే ‘పుష్ప’ విషయంలో రెండో పార్టు ప్రారంభం డేట్ చెప్పారు కానీ అవ్వలేదు. ఆ ఇబ్బంది ఉండకూడదు అనే డేట్ చెప్పలేదు అంటున్నారు.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!