ట్విట్టర్ సాక్షిగా క్లారిటీ ఇచ్చిన సోనాక్షి సిన్హా

నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటిల క్రేజీ కాంబినేషన్ లో రూపొందనున్న మూడో చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా, కేతరీన్ థెరిసాలు నటిస్తున్నట్లుగా కొన్ని రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. కేతరీన్ కన్ఫర్మ్ చేయగా.. సోనాక్షి మాత్రం ఎందుకో స్పందించలేదు. దాంతో ఈ కాంబినేషన్ కన్ఫర్మ్ అనే అనుకున్నారు అందరూ.

కట్ చేస్తే.. తాను బాలయ్య-బోయపాటి కాంబినేషన్ సినిమాలో నటిస్తున్నట్లు వచ్చిన వార్తలను సోనాక్షి సిన్హా కొట్టిపారేసింది. బాలకృష్ణ సినిమాలో నటిస్తున్నాననే వార్తలు నిజం కాదు. నేను చేయబోయే కొత్త సినిమా విషయాలను త్వరలో వెల్లడిస్తానని సోనాక్షి ట్విట్టర్ లో స్పష్టం చేసింది. మరోవైపు బాలయ్య కొత్త చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటించనున్నట్లు వార్తలు రాగా..దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. బాలకృష్ణ నటించిన రూలర్ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus