Sonakshi Sinha: వైరల్‌ ఫొటోపై స్పందించిన సోనాక్షీ!

సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి… బాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌ టాపిక్‌ ఇది. బాలీవుడ్‌ మీడియా ఏ వార్తా లేకపోతే సల్మాన్‌ ఖాన్‌ పెళ్లి గురించి మాట్లాడతారు అనే సెటైర్‌ కూడా వినిపిస్తూ ఉంటుంది. రెగ్యులర్‌ మీడియాకు పోటీగా వస్తోంది అంటున్న సోషల్‌ మీడియా కూడా దీనికి అతీతం కాదు. ఈ క్రమంలో సల్మాన్‌ ఖాన్‌ ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది అంటూ ఇటీవల ఓ ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి కూతురుగా ఉన్న సోనాక్షీ సిన్హా. దీనిపై చాలామంది రకరకాలుగా స్పందించారు. తాజాగా సోనాక్షీ కూడా స్పందించింది.

సల్మాన్‌ ఖాన్‌ సంప్రదాయ దుస్తుల్లో సోనాక్షీ సిన్హాకు రింగ్‌ తొడుగుతున్నట్లుగా ఆ ఫొటో ఉంది. ఫస్ట్‌లుక్‌లో ఎవరికైనా ఈ ఫొటో నిజమే అనిపించేలా ఉండటంతో ‘ఏంటీ సల్మాన్‌ ఎంగేజ్‌మెంట్‌ సోనాక్షీతోనా?’ అంటూ ఆశ్చర్యపోవడం ప్రారంభించారు. తెలిసినవాళ్లకు ఆ ఫొటోను పంపించేశారు. అయితే అక్కడికి కాసేపటికే ఆ ఫొటో ఒరిజినల్‌ కాదు అని తెలుసుకుని ‘హమ్మా’ అనుకున్నారు. ఆ ఫొటో మీరూ చూస్తే ఇలానే అనుకుంటారు. ఎందుకంటే అంత చక్కగా మార్ఫ్‌ చేశారు. ఆ ఫొటో గురించే సోనాక్షీ స్పందించింది.

మీరు అలా ఎలా ఆలోచిస్తున్నారు అసలు అంటూ సోనాక్షీ నేరుగానే స్పందించింది. రియల్‌ ఫొటోకి, మార్ఫింగ్‌ ఫొటోకీ తేడా తెలుసుకోలేకపోతున్నారా అంటూ సోనాక్షీ ఓ నెటిజన్‌ను ప్రశ్నించింది. సోనాక్షీ కోపానికి అర్థం ఉంది. సల్మాన్‌ను సోనాక్షీ అభిమాన నటుడిగా ఆరాధిస్తుంటుంది. సల్మాన్‌ ‘దబంగ్‌’ సినిమాతోనే సోనాక్షీ ఇండస్ట్రీకి పరిచయమైంది. అయినా సల్మాన్‌ డేటింగ్‌ చేస్తున్నారు అంటూ బయటికొచ్చిన హీరోయిన్లు, నటీమణుల జాబితాలో ఎప్పుడూ ఆమె పేరు వినిపంచలేదు. అలాంటి ఆమె ఫొటో ఇలా బయటకు రావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ ఫొటో మార్ఫింగ్‌ అనే విషయం మనకు తెలిసింది. అయితే ఒరిజినల్‌గా ఆ ఫొటోలో ఎవరెవరు ఉన్నారో తెలుసా? వాళ్లు కూడా హీరో హీరోయిన్లే. ఆ తర్వాత భార్యాభర్తలుగా మారారు. వాళ్లే ఆర్య – సాయేషా సైగల్‌. వాళ్ల ఎంగేజ్‌మెంట్‌ ఫొటోనే ఓ నెటిజన్‌ అలా మార్ఫింగ్‌ చేసి వైరల్‌ చేశారు.

బిగ్ బాస్ నాన్ స్టాప్ 17మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

‘భీమ్లా నాయక్’ లోని అదిరిపోయే డైలాగులు ఇవే..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus