హీరోల ఇంటి పేర్లు లేదా వారి స్టార్ ట్యాగ్ లతో వచ్చిన 11 సినిమా పాటల లిస్ట్..!

  • August 21, 2021 / 11:16 AM IST

స్టార్ హీరోల సినిమాల్లో అభిమానుల చేత విజిల్స్ వేయించడానికి హీరోల నిజ జీవితంలోని కొన్ని సందర్భాలను సినిమాల్లో వాడుకుంటూ ఉంటారు దర్శక నిర్మాతలు.ఉదాహరణకు చెప్పాలంటే.. ‘నేను రామ్ కొణి..దెల’ అంటూ ‘వినయ విధేయ రామ’ సినిమాలో రాంచరణ్ చెప్పిన డైలాగ్ లాంటివి..! అలాంటి సీన్లు హీరోల అభిమానులు మళ్ళీ మళ్ళీ చూడాలని అలాగే ఆ డైలాగులను మళ్ళీ మళ్ళీ వినాలని ఆసక్తి చూపుతుంటారు.కొంతమంది వాటిని హలో ట్యూన్లుగా కూడా సెట్ చేసుకుంటారు. దీనిని ఆడియెన్స్ పల్స్ అంటుంటారట మన సినీ భాషలో.! సందర్భం ఉన్నా లేకున్నా వారిలో జోష్ నింపడానికి దర్శకనిర్మాతలు చేసే హడావిడి ఇది. ఇదిలా ఉండగా.. దర్శకులతోనూ, రైటర్లతో పోలిస్తే మేమేం తక్కువ కాదు అంటూ కొంతమంది సంగీత దర్శకులు ఆ హీరో క్రేజ్ ను వాడుకోవడానికి వారి ఇంటి పేర్లు లేదా వారి స్టార్ ఇమేజ్ లను, లేదంటే ఆ హీరో పేరులో ఏదో ఒక పదాన్ని పాటల్లో లిరిక్స్ రూపంలో వాడుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ఆ హీరోలు ఎవరు.. వారి ఇంటి పేరు లేదా వారి స్టార్ ఇమేజ్ లేదా వారిలో పేరులో ఏదో ఒక పదంతో వచ్చిన ఆ పాటల లిరిక్స్ ఏంటి ? అనే విషయం పై ఓ లుక్కేద్దాం రండి :

1) కొదమసింహం : మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమాలో ‘స్టార్ స్టార్ మెగాస్టార్ స్టార్’ అంటూ ఓ పాటలో లిరిక్ ఉంటుంది. దీనిని ఇప్పటికీ వాడుకుంటూనే ఉంటారు అభిమానులు.

2) కొమరం పులి : పవన్ కళ్యాణ్ నటించిన ఈ సినిమాలో ‘పవర్ స్టార్ పవర్ స్టార్’ అంటూ అతని స్టార్ ఇమేజ్ ను వాడుకుని ఓ లిరిక్ ఉంటుంది.

3)సమరసింహారెడ్డి : బాలకృష్ణ నటించిన ఈ సినిమాలో ‘నందమూరి నాయక అందమైన కానుక’ అంటూ అతని ఇంటిపేరుని గుర్తు చేస్తూ ఓ లిరిక్ ఉంటుంది.

4) బాబు బంగారం, నమో వెంకటేశ : వెంకటేష్ నటించిన ‘బాబు బంగారం’ చిత్రంలో ‘వెంకటేషో దగ్గుబాటి బాసు’ అంటూ ఓ లిరిక్ ఉంటుంది.. అలాగే ‘నమో వెంకటేశ’ సినిమాలో ‘నమో నమో వెంకటేశ’ అంటూ అతని పేరుని గుర్తుచేస్తూ మరో లిరిక్ ఉంటుంది.


5)నిర్ణయం: నాగార్జున నటించిన ఈ సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ‘హలో గురు ప్రేమ కోసమేనోయ్’ అంటూ ఓ పాట ఉంటుంది. ఇందులో ‘అక్కినేని అంతటోడ్ని’ అంటూ నాగార్జున ఇంటిపేరుతో ఓ లిరిక్ కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు.

6) ఆర్య, బన్నీ : అల్లు అర్జున్ నటించిన ఈ సినిమాలో ‘అ అంటే అమలాపురం’ అనే పాట ఉంటుంది. ఇందులో ‘అల్లు వారి పిల్లగాడా’ అంటూ ఓ లిరిక్ ఉంటుంది. అలాగే ‘బన్నీ’ సినిమాలో ‘బన్ని బన్ని’ అనే లిరిక్ తో ఓ పాట ఉంటుంది.


7)సాంబ, నా అల్లుడు : ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రంలో ‘నందమూరి చందమామకెంత ఊపో’ అంటూ లిరిక్ ఉంటుంది. అలాగే ‘నా అల్లుడు’ సినిమాలో ‘మా తాత నందమూరి నాయగన్’ అంటూ ఓ లిరిక్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అంతేకాదు ‘యమదొంగ’ లో ‘యంగ్ యమ’ పాటలో ‘తారకమంత్రం’ అనే లిరిక్ కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు.



8)రచ్చ : రాంచరణ్ నటించిన ఈ సినిమాలో ‘కొణిదెల వారి కొడకా’ అంటూ ఓ లిరిక్ ఉండడాన్ని మనం గమనించవచ్చు. అలాగే ‘బ్రూస్ లీ’ సినిమాలో ‘మెగా మెగా పవర్’ అంటూ ఓ లిరిక్ ఉండడాన్ని మనం గమనించవచ్చు.


9)అఖిల్ : అక్కినేని అఖిల్ నటించిన ఈ చిత్రంలో ‘అక్కినేని అక్కినేని’ అంటూ ఓ లిరిక్ ఉంటుంది.

10) సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు హీరోగా వచ్చిన ఈ చిత్రంలో ‘MB’ ని ఇండికేట్ చేస్తూ ‘మైండ్ బ్లాక్’ లిరిక్ ను జోడించాడు దేవి. ‘అలాగే బాబు నువ్వు చెప్పు’ అంటూ డైలాగ్ ను కూడా జతచేసాడు.

11) డాన్ శీను : రవితేజ నటించిన ఈ చిత్రంలో ‘రాజ రాజ రవితేజ’ అంటూ ఓ పాట ఉండడాన్ని మనం గమనించవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus