Bigg Boss 8 Telugu: విష్ణుప్రియపై సోనియా ఘోరమైన మాటలు… కారణం అదేనా?

విష్ణు ప్రియపై (Vishnu Priya) ఘోరమైన కామెంట్లు చేసి ఆమె హైలెట్ అయ్యేలా చేసింది సోనియా. సోషల్ మీడియాలో ఇప్పుడు అంతా దానిపైనే డిస్కషన్ నడుస్తుంది. విష్ణు ప్రియ గేమ్ (Bigg Boss 8 Telugu) అంతంత మాత్రంగానే ఉన్నా.. ఆమెపై ఇప్పుడు సింపతీ ఏర్పడి హైలెట్ అయిపోయింది. దీనికి కారణం సోనియా అనే చెప్పాలి. ‘ఆడదానికి ఆడదే శత్రువు’ అంటూ దర్శకుడు పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) చెప్పింది నిజమే అని ఈ ఇన్సిడెంట్ మళ్ళీ ప్రూవ్ చేసింది. విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి మాత్రమే కాదు…

Bigg Boss 8 Telugu

తల్లి లేని ఆమెకు ‘నీకు ఫ్యామిలీ లేదు’ అన్నట్టు కామెంట్ చేయడం కూడా ఎమోషనల్ గా టార్గెట్ చేయడమే అని అంతా భావిస్తున్నారు. ఇదంతా కూడా నామినేషన్స్ లో వీరిద్దరి మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధం వల్లనే అని చెప్పడంలో కొత్తేమీ లేదు. ‘బట్టలు సరిగ్గా వేసుకుని మగవాళ్ళ పక్కన నిలబడాలనే మినిమమ్ సెన్స్ కూడా నీకు తెలియట్లేదు. ఓ పక్క వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అయినా సరే మళ్లీ వాళ్ళ పక్కకే వెళ్లి నిలబడటం.. అడల్ట్‌రీ కాకా మరేంటి?’ విష్ణు ప్రియ క్యారెక్టర్ పై సోనియా నెగిటివ్ కామెంట్స్ చేసింది.

అందుకు విష్ణుప్రియ.. “‘హలో ఏం మాట్లాడుతున్నావ్.. ఎవర్ని ఎప్పుడు..? నేను ఎవరి దగ్గర అలా ప్రవర్తించానో చెప్పు?’ అంటూ ప్రశ్నించింది. అందుకు సోనియా.. ‘అందరి వద్ద’ అన్నట్టు సమాధానం ఇచ్చింది. జరిగిందేంటంటే.. ‘విష్ణు ప్రియ చీర కట్టుకుంటుంటే.. ఆదిత్య ఓం పొరపాటున బెడ్ రూంలోకి వెళ్ళాడట. తర్వాత విష్ణుప్రియ చీర కట్టుకుంటుంది అని గ్రహించి వెంటనే బయటకు వెళ్లిపోయాడు. తర్వాత విష్ణు ప్రియ.. ఆదిత్య ఓం వద్దకు వెళ్లి సారీ చెప్పడం జరిగింది.

అందుకు ఆదిత్య ఓం కూడా కొంచెం రిగ్రెట్ ఫీలయ్యి ఇబ్బంది పడ్డాడు. ఇది తెలియక సోనియా ‘ విష్ణుప్రియ క్యారెక్టర్ గురించి చాలా దారుణంగా మాట్లాడేసింది. విష్ణుప్రియపై ఆడియన్స్ లో ఉన్న ఓ రకమైన నెగిటివిటీ తనకు కలిసొస్తుంది అని సోనియా భావించినట్టు ఉంది. కానీ ఆడియన్స్ అన్నీ గ్రహిస్తారు. అందుకే సోనియా ట్రోల్ అవుతుంది. అలాగే (Bigg Boss 8 Telugu) వీకెండ్లో నాగార్జున (Nagarjuna) కూడా క్లాస్ పీకే ఛాన్స్ లేకపోలేదు.

యాక్షన్‌ హీరోతో సినిమాకు పూరి రెడీ.. ప్రాజెక్ట్‌ ఓకే అయిందా?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus