కోవిడ్ సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకొని రియల్ హీరో అనిపించుకున్నాడు సోనూసూద్. గతేడాది నుంచి ఇప్పటివరకు వేల మందికి తన సాయం అందించాడు. ఇప్పటికీ తన సేవలను కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ప్రజలు కూడా ఏదైనా కష్టమొస్తే సోనూనే సాయం కోరుతున్నారు. ఈ క్రమంలో చాలా మంది తనకు ఫోన్లు చేస్తున్నారని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు సోనూసూద్. సాయం కోరుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అర్ధరాత్రి ఫోన్లు రావడం పట్ల తనకు ఎలాంటి ఇబ్బంది లేదని..
కానీ వాళ్లకు చేయూతనందించేవాళ్లు లేరా అని బాధగా ఉందని అన్నారు. ఒకరిపై ఒకరు నిందలేసుకోవడం మానేసి.. ఉద్యోగాలు కల్పించడం, పేదల ఆకలి తీర్చడం, ఉచిత విద్య అందించడం ద్వారా ఈ సమస్యలు పరిష్కరించవచ్చని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. గతేడాది కరోనా సమయంలో వలస కార్మికుల కోసం సోనూ ఎంతగానో శ్రమించారు. ప్రత్యేకంగా వాహనాలు ఏర్పాటు చేసి కార్మికులను తన స్వస్థలాలకు చేర్చారు. ఆక్సిజన్ ప్లాంట్స్ ను కూడా ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం కూడా చేయలేని ఎన్నో పనులను ఆయన చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో సోనూ కీలకపాత్రలో కనిపించనున్నారు.
When I receive distress calls in the middle of night from some unknown people seeking help,
I don’t get annoyed but I feel worried seeing their helplessness.
This can only end if we stop playing blame games and adopt a needy🇮🇳Give jobs
Feed poor
Give education.🙏— sonu sood (@SonuSood) October 31, 2021
Most Recommended Video
రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!