నటుడు సోనూసూద్ మరియు అతని సహచరులు రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ శనివారం తెలిపింది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) బాలీవుడ్ నటుడు మరియు అతని సహాయకుల ప్రాంగణంలో సెర్చ్ చేస్తున్నప్పుడు, పన్ను ఎగవేతకు సంబంధించిన నేరపూరిత ఆధారాలు బయటపడ్డాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ గత కొన్ని రోజుకుగా బాలీవుడ్ సోనూసూద్ కు సంబంధించిన ఆస్తులపై ఫోకస్ పెట్టింది.
అతని సహాయకుల ఇళ్లల్లో కూడా సోదాలు చేస్తున్నప్పుడు, పన్ను ఎగవేతకు సంబంధించిన నేరపూరిత ఆధారాలను గుర్తించారు. నటుడు సోనూసూద్ దాదాపు రూ .20 కోట్లకు పైగా పన్నులు ఎగవేసినట్లు, ఆదాయపు పన్ను శాఖ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) చట్టాన్ని ఉల్లంఘిస్తూ క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి విదేశీ దాతల నుండి రూ .2.1 కోట్లను సేకరించినట్లు పన్ను శాఖ తెలిపింది. కొవిడ్ కష్టకాలంలో సోనూసూద్ చేసిన సేవా కార్యక్రమాలు దేశ ప్రజల మనసులో నిలిచిపోయాయి.
ఇక మొదటి వేవ్ సమయంలో ఆయన ఏర్పాటు చేసిన ట్రస్ట్ ద్వారా రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించగా అందులో రూ.1.9 కోట్లు మాత్రమే సహాయ కార్యక్రమాలకు వినియోగించారని అధికారులు వెల్లడించారు. మిగతా డబ్బు ఆ సంస్థ ఖాతాలోనే ఉండిపోయిందని వివరణ ఇచ్చారు. ఇక ఈ ఆరోపణలపై సోనూసూద్ వివరణ ఇవ్వాల్సి ఉంది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!