Sonu Sood: పాతరోజులను గుర్తు చేసుకున్న రియల్ హీరో!

రియల్ హీరో సోనూసూద్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు విలన్ పాత్రలు చేయడం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న సోనూసూద్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్న ప్రజలకు దేవుడిలా కనిపిస్తున్నారు. సోనూసూద్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రజలు ప్రశంసిస్తున్నారు. కోట్ల రూపాయల సొంత డబ్బును సోనూసూద్ ప్రజల కోసం ఖర్చు చేస్తుండటం గమనార్హం. అంతర్జాతీయ స్థాయిలో సోనూసూద్ పేరు మారుమ్రోగుతుండగా సోనూసూద్ ఎంతోమందికి సహాయం చేయడం గమనార్హం.

ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ కవర్ పేజ్ పై సోనూసూద్ ఫోటోలను వేసి ఆయనకు అరుదైన గౌరవాన్ని ఇచ్చింది. తన ఫోటోలను ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ పై చూసుకున్న సోనూసూద్ తన పాతరోజులను గుర్తు చేసుకోవడంతో పాటు ఎమోషనల్ అయ్యారు. ఆ రోజులు తనకు ఇంకా గుర్తున్నాయని లూథియానా నుంచి డీలక్స్ ఎక్స్ ప్రెస్ రైలును ఎక్కి ముంబై రైల్వే స్టేషన్ లో దిగానని సోనూ అన్నారు. తాను లూథియానా రైల్వే స్టేషన్ లో ఫిల్మ్ ఫేర్ మ్యాగజైన్ ను కొన్నానని 20 సంవత్సరాల తర్వాత ఆ మ్యాగజైన్ కవర్ పేజీపై తాను ఉన్నానని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

కలలు నేర్చుకోవడానికి సమయం పట్టినా ఏదో ఒకరోజు కల నెరవేరుతుందని సోనూసూద్ తన కల ఏ విధంగా నెరవేరిందో వెల్లడించారు. ప్రస్తుతం సోనూసూద్ తెలుగులో ఆచార్య మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నారు. దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండగా మేకర్స్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus