‘దైవం మనుష్య రూపేణ’.. అంటుంటారు పెద్దలు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం అంటే సోనూ సూద్ పేరు చెప్పొచ్చు. సినిమాల్లో భయంకరమైన, క్రూరమైన విలన్ గా కనిపించే ఈ ఆరడుగుల ఆజాన బాహుడు… బయట మాత్రం ఆరడుగుల బంగారు మనిషనే చెప్పాలి. కరోనా ఎంతో మందిని తీసుకుపోయింది అదే సమయంలో నిజమైన హీరోలను జనాలకి పరిచయం చేసింది. అందులో సోనూసూద్ ప్రముఖుడు. ఫస్ట్ వేవ్లో లాక్ డౌన్ పడినప్పుడు వలస కూలీలను తమ గమ్య స్థలాలకి చేర్చాడు.
వారి ఆకలి తీర్చాడు. అందుకోసం స్పెషల్ బస్సులు, ట్రైన్ లు, ఫ్లైట్ సర్వీసులు కూడా ఏర్పాటు చేసాడు. అటు తర్వాత రైతుల కష్టాలను కూడా తీర్చాడు. నిజజీవితంలో రియల్ హీరో అంటే సోనూ సూద్ అనే చెప్పాలి. అయితే ఇప్పుడు అతను మరోసారి దేవుడనిపించుకుని ప్రశంసలు అందుకుంటున్నాడు. ‘ఈడు గొల్డెహె’ అంటూ సినిమా పేర్లతో ఇతన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు జనాలు. అంతలా సోనూ సూద్ చేసింది ఏంటి..! విషయంలోకి వెళ్తే… పంజాబ్‌లో మోగా అనే ప్రాంతం ఉంది.
అక్కడ రాత్రి పూట ఓ యువకుడి కారు యాక్సిడెంట్ కు గురైంది. అతని వయసు కేవలం 19 ఏళ్ళు మాత్రమే..! ఫ్లై ఓవర్ కింద అతని కారు యాక్సిడెంట్ కు గురయ్యి నుజ్జు నుజ్జు అయ్యింది.ఆ టైములో అదే వైపుకి వెళ్తున్న సోనూసూద్ వెంటనే ఘటనా స్థలం దగ్గర ఆగి సహాయక చర్యలు చేపట్టాడు.సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది కాబట్టి ఆ కారు వెంటనే తెరుచుకోలేదు. దీంతో కొంత టైం పట్టింది.సోనూసూద్ తన బృందం పై ఒత్తిడి పెట్టి, శ్రమించి ఎట్టకేలకు ఆ యువకున్ని బయటకు తీయించాడు.
తర్వాత వెంటనే దగ్గర్లో ఉన్న ఆసుపత్రికి అతన్ని చేర్చి అతని ప్రాణాలు నిలబెట్టగలిగాడు. ప్రస్తుతం ఆ యువకుడి ఆరోగ్యం బాగానే ఉంది, త్వరలోనే కోలుకుంటాడని.. వైద్యులు చెబుతున్నారు.హాస్పిటల్ బిల్ మొత్తం సోనూ సూదే కట్టేసాడట. ఆ సమయానికి దేవుడిలా వెళ్ళి ఆ కుర్రాడి ప్రాణాలు కాపాడాడు సోనూసూద్.అందుకే నెటిజన్లు సోనూ సూద్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవుడు అన్ని చోట్లా కూడా ఉంటే బాగుణ్ణు కదా..!