Sonu Sood: సోనూసూద్ తప్పు చేయలేదా.. వాస్తవం ఇదేనా..?

2020 సంవత్సరంలో లాక్ డౌన్ రూల్స్ అమలులోకి వచ్చిన తరువాత వలస కార్మికులను ఆదుకోవడం కోసం సోనూసూద్ ముందుకు వచ్చారు. ఎంతోమంది వలస కార్మికులను ఆదుకోవడంతో పాటు కష్టాల్లో ఉన్న పేదలకు తనవంతు సహాయం చేశారు. అయితే గత కొన్నిరోజుల నుంచి సోనూసూద్ స్కామ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. తాజాగా ఒడిశాకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా గంజాం సిటీ ఆస్పత్రిలో బెడ్ కావాలని సోనూసూద్ ను కోరారు.

ఆ తరువాత సోనూసూద్ బెడ్ అరేంజ్ చేశానని పోస్ట్ పెట్టారు. అయితే గంజాం జిల్లా కలెక్టర్ తనకు సోనుసూద్ నుంచి, సోనూసూద్ ఫౌండేషన్ నుంచి బెడ్ కావాలని ఎటువంటి అభ్యర్థన రాలేదని జిల్లాలో బెడ్ ఇష్యూలు లేవని సోనూసూద్ పై ప్రజల్లో అనుమానం కలిగేలా పోస్ట్ పెట్టారు. అయితే గంజాం కలెక్టర్ కు సోనూసూద్ ధీటుగా జవాబు ఇచ్చారు. తాను బెడ్ అరేంజ్ చేశానే తప్ప మీతో మాట్లాడి అరేంజ్ చేశానని ఎక్కడా చెప్పలేదని సోనూసూద్ అన్నారు.

రోగికి బెడ్ అందిందని చెబుతూ వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సోనూసూద్ విమర్శలకు చెక్ పెట్టారు. మరోవైపు సోనూసూద్ స్కామ్ అంటూ వెలుగులోకి వస్తున్న వార్తల్లో నిజం లేదని సోనూసూద్ ఫ్యాన్స్ ఆధారాలతో సహా చూపిస్తున్నారు. కొందరు సోనూసూద్ పరువు తీసేందుకు ఫేక్ ట్వీట్లను వైరల్ చేస్తున్నారని వాటిని నమ్మవద్దని సోనూసూద్ ఫ్యాన్స్ చెబుతున్నారు. సోనూసూద్ కు వస్తున్న మంచిపేరును తట్టుకోలేక కొంతమంది కావాలనే ఈ తరహా దుష్ప్రచారాన్ని చేస్తున్నారని సోనూసూద్ ఫ్యాన్స్ వెల్లడిస్తున్నారు. నిస్వార్థంగా సోనూసూద్ సేవ చేస్తున్నప్పటికీ కొందరు ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిమానులు వాపోతున్నారు.


Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus