Sonu Sood: రాజకీయాలపై అలాంటి కామెంట్లు చేసిన సోనూ!

భాషతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాల్లో సోనూసూద్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఏ స్వార్థం లేకుండా తన సొంత డబ్బుతో సోనూసూద్ ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు. సోనూసూద్ చేసిన సేవాకార్యక్రమాల వల్ల ఎంతోమంది కష్టాల్లో ఉన్నవాళ్లకు సకాలంలో ప్రయోజనం చేకూరింది. సోనూసూద్ రాజకీయాల్లోకి చేరితే ఎక్కువమంది పేదలకు సహాయం చేసే అవకాశం ఉంటుందని ఎక్కువమంది భావిస్తున్నారు. సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని చాలామంది కోరుకుంటున్నారు. అయితే సోనూసూద్ మాత్రం తనకు రాజకీయాలంటే ఆసక్తి లేదని ఇప్పటికే చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.

Click Here To Watch NOW

తాజాగా సోనూసూద్ ఇదే విషయాన్ని కన్ఫామ్ చేశారు. సినిమాల్లో విలన్ రోల్స్ పోషిస్తున్న సోనూసూద్ నిజ జీవితంలో మాత్రం హీరో అయ్యారు. సోనూసూద్ సోదరి పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించలేదు. తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సోనూసూద్ మాట్లాడుతూ కరోనా కేసులు పెరిగిన సమయంలో జనాలు ఎదుర్కొన్న సమస్యలను చూస్తుంటే బాధ అనిపించేదని వెల్లడించారు. తాను సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నానని సోనూసూద్ చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాలతో సేవా కార్యక్రమాలతో బిజీగా ఉన్నానని సోనూసూద్ వెల్లడించారు. సేవ చేయడానికి దేవుడి దయ ఉంటే చాలని పవర్ అవసరం లేదని సోనూసూద్ అన్నారు. దేశ నిర్మాణంలో యువతే కీలకం అని సోనూసూద్ చెప్పుకొచ్చారు. పాండమిక్ పోయినా సమస్యలు మాత్రం పోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. సోనూసూద్ విలన్ రోల్ లో నటించిన ఆచార్య ఈ నెల 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. మరికొన్ని కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని సోనూసూద్ వెల్లడించారు.

సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఉన్నత పదవులు పొందుతారని నెటిజన్లు భావిస్తున్నారు. సోనూసూద్ సొంతంగా పార్టీ పెట్టినా సక్సెస్ అవుతారని మరి కొందరు భావిస్తున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో సోనూసూద్ రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటూ ఉండటం గమనార్హం.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus