Sonu Sood: సోనూ సూద్ ధరించిన స్టైలిష్ జాకెట్ కాస్ట్ ఎంతంటే..!

సాధారణంగా నెటిజన్లకు, స్టార్ల అభిమానులకు వారి పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన వివరాలు.. ఇల్లు, లగ్జరీ కార్స్, రెమ్యునరేషన్స్, ధరించే ఆభరణాలు.. వాచెస్ వంటి వాటి వివరాలు తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.. అలాంటి విషయాలు వెలుగులోకి వస్తే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. ఇక హీరోయిన్ల డ్రెస్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ లాంటి ధరలు తెలిస్తే లేడీ ఫ్యాన్స్ మామూలుగా షాక్ అవరసలు.. ఇప్పటికే ఇటువంటి వాటికి సంబంధించిన వార్తలు చాలానే చూశాం..

ఇప్పుడు రియల్ హీరో సోనూ సూద్ స్టైలిష్ జాకెట్ రేట్ గురించి న్యూస్ వైరల్ అవుతోంది.. సోనూ గురించి ఇండియన్ ఆడియన్స్‌కి స్పెషల్ ఇంట్రడక్షన్ అక్కర్లేదు.. సినిమాల్లో విలన్‌గా కనిపించే ఆయన రియల్ లైఫ్‌లో గుడ్ హ్యూమన్ బీయింగ్.. కరోనా కష్టకాలంలో దేశ వ్యాప్తంగా.. మారు మూల పల్లెలకు సైతం ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి.. ఎందరికో పునర్జన్మ ప్రసాదించి రియల్ హీరో అనిపించుకున్నారు..

ప్రజలను సొంత గ్రామాలకు పంపడం, ఆక్సిజన్ సిలిండర్లు పంచడం, ఉద్యోగావకాశాలు కల్పించడం, విలువైన వైద్య సదుపాయాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది.. ఎవరి మీదా ఆధారపడకుండా తన సొంత డబ్బుతో.. ఉన్న ఆస్తులు అమ్మి మరీ సహాయ సహకారాలు అందించి ఎందరో జీవితాల్లో వెలుగులు నింపారు.. ప్రశంసలు, పాలభిషేకాలు, విగ్రహాలు ఏర్పాటు చేయడం వంటి పలు కార్యక్రమాలతో ఆయన మీద తమ అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేశారు ప్రజలు..

ఇక సోనూ సూద్ ధరించిన జాకెట్ వివరాలు ఇలా ఉన్నాయి.. Dolce & Gabbana – Logo Panel Bomber Jacket – కాస్ట్ : రూ. 1,11,142/- (1,345 డాలర్స్).. చూడ్డానికి సింపుల్‌గా ఉన్న ఈ జాకెట్‌లో స్టైలిష్‌గా ఉన్నారు రియల్ హీరో సోనూ సూద్.. కరోనా తర్వాత ‘ఆచార్య’ లో ప్రతినాయకుడిగా కనిపించిన సోనూ ఆ తర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు.. అయితే హిందీలో హీరోగా ‘ఫతే’ అనే ఫిలింలో నటిస్తున్నారు..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus