Souryam Collections: గోపీచంద్ ‘శౌర్యం’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

గోపీచంద్ ఇప్పుడంటే ఫామ్లో లేడు కానీ అప్పట్లో.. మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో అని చెప్పుకోవచ్చు. అతని ఖాతాలో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో ‘శౌర్యం’ మూవీ కూడా ఒకటి. ‘భవ్య క్రియేషన్స్’ బ్యానర్ పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని శివ డైరెక్ట్ చేశారు. అప్పటివరకు కెమెరామెన్ గా ఉన్న అతనికి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చింది గోపీచంద్ అని చాలా మందికి తెలీదు.

తమిళంలో ‘సిరుతై’ ‘వీరం’ ‘వేదాలం’ ‘విశ్వాసం’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెరకెక్కించి స్టార్ ఇప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ‘శౌర్యం’ సినిమా 2008 సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యింది. ఈరోజుతో ఈ సినిమా రిలీజ్ అయ్యి 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘శౌర్యం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 3.87 cr
సీడెడ్ 1.01 cr
ఉత్తరాంధ్ర 2.10 cr
ఈస్ట్ 1.11 cr
వెస్ట్ 0.90 cr
గుంటూరు 0.77 cr
కృష్ణా 1.03 cr
నెల్లూరు 0.68 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 11.47 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.40 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 12.87 cr (షేర్)

‘శౌర్యం’ చిత్రం రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా రూ.12.87 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.2.87 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి ఈ మూవీ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus