ఫిలిమ్ ఫ్రాటర్నిటీ అంటే బాలీవుడ్ మాత్రమే కాదు మోడీ గారు: ఉపాసన

రామ్ చరణ్ సతీమణిగానే కాక అపోలో హాస్పిటల్స్ ను విజయవంతంగా హ్యాండిల్ చేస్తూ మోస్ట్ ఎఫెషియంట్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ఉపాసన కొణిదెల సోషల్ మీడియాలో భలే యాక్టివ్ గా ఉంటుంటుంది. ఇతర స్టార్ హీరోలైన మహేష్ బాబు, ఎన్టీఆర్ ల సతీమణులతోనూ స్నేహంగా వ్యవహరిస్తూ.. అందరి అభిమానులను స్పెషల్ ఫోటోస్ తో థ్రిల్ చేయడంలో ఉపాసన సిద్ధహస్తురాలు. కాంట్రవర్సీలకు చాలా దూరంగా ఉంటూ చాలా పాజిటివ్ గా లైఫ్ లీడ్ చేసే ఉపాసన అంటే మెగా అభిమానులకు మాత్రమే కాదు.. సినీ వర్గాలకు చెందిన వారికి కూడా ప్రత్యేకమైన అభిమానం. అలాంటి ఉపాసన కొణిదెల ఉన్నట్లుండి ఏకంగా ప్రధాన మంత్రి మోడీ మీద విరుచుకుపడడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

నిన్న బాలీవుడ్ నటీనటులందరినీ కలిసిన నరేంద్ర మోడీ.. వాళ్లందరికీ ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. అందరితో సెల్ఫీలు తీసుకొని హల్ చల్ చేశారు. మోడీ వాళ్లందరితో “ఛేంజ్ ఇన్ ఇట్” అనే ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. అయితే.. అందులో టాలీవుడ్ కి చెందిన హీరోలు కానీ డైరెక్టర్లు కానీ లేకపోవడం మాత్రం చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ విషయంలో ఉపాసన కాస్త ఘాటుగా ప్రదర్శించింది.. “ఫిలిమ్ ఫ్రాటర్నిటీ అంటే టాలీవుడ్ లేదా, మీరు మాకు ప్రధాన మంత్రి అవ్వడం మాకు గర్వకారణమే కానీ.. ఇలా సినిమా ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అని మాత్రమే భావించడం మాత్రం మమ్మల్ని బాధించింది” అని పేర్కొంటూ ఉపాసన చేసిన ట్వీట్ కి టాలీవుడ్ నుంచి భారీ స్థాయిలో సపోర్ట్ లభించింది. మరి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మోడీ ఏమైనా స్పందిస్తాడో లేదో చూడాలి.

1

2

3

4

5

రాజుగారి గది 3 సినిమా రివ్యూ & రేటింగ్!
ఆపరేషన్ గోల్డ్ ఫిష్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus