బాలు మరణానంతరం అభిమానులు శోక సంద్రంలో మునిగిపోగా, కొందరు పనిగట్టుకుని ఆస్పత్రి బిల్లులపై వివాదానికి పురుడు పోశారు. ఆ వందంతులపై ఎస్పీ చరణ్ స్పందించారు. బిల్లు చెల్లించని కారణంగా బాలు పార్థీవ దేహాన్ని ఎంజిఎం ఆస్పత్రి వర్గాలు ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించలేదని కొందరు ప్రచారం చేశారు. పుకార్లు సృష్టించారు. బాలు కుటుంబాన్ని ఆసుపత్రి వర్గాలు ఇబ్బందిపెట్టాయి అన్నారు. డబ్బు సర్దుబాటు చేయాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని బాలు కుటుంబ సభ్యులు కోరగా అందుకు ప్రభుత్వం తిరస్కరించిందని పుకార్లు పుట్టించారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ఆయన కుమార్తె దీపా వెంకట్ జోక్యం చేసుకున్నారనే మాటలూ వినిపించాయి. దాంతో బాలు ఆస్పత్రి బిల్లు ఎంత? ఎవరు కట్టారు? అని చర్చ మొదలైంది. తన తండ్రి ఆస్పత్రి బిల్లుల విషయంలో ప్రచారంలో వున్న వార్తలేవీ వాస్తవాలు కావనీ, అదంతా తప్పుడు ప్రచారమే అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. సదరు వార్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధంగా ఎందుకు చేస్తున్నారో తనకు తెలియదనీ, నిజమైన బాలు అభిమానులు ఎవరూ ఇలా చేయరని ఆయన అన్నారు.
ఆస్పత్రి బిల్లు ఎంత అయ్యింది? ఎవరు ఎంత చెల్లించారు? వంటి వివరాలు త్వరలో ఎంజిఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి విడుదల చేస్తానని చరణ్ తెలిపారు. ఈ పరిస్థితి రావడం నిజంగా ఎంతో దురదృష్టకరమని ఆయన ఒక వీడియో విడుదల చేశారు. తన తండ్రి చికిత్సకు అవసరమైన వైద్య పరికరాలను ఎంజిఎం ఆస్పత్రికి అపోలో ఆస్పత్రి వారు పంపించారని ఆయన పేర్కొన్నారు.
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!