Akhanda 2: అప్పుడు బైక్‌.. ఇప్పుడు కారు.. అయితే ఈసారి ముందే చూపించేశారు

బోయపాటి శ్రీను – నందమూరి బాలకృష్ణ సినిమాల్లో యాక్షన్‌ ఓ లెవల్‌లో ఉంటుంది. బాలయ్య ఇమేజ్‌కి, బోయపాటి లార్జర్‌ ద్యాన్‌ లైఫ్‌ యాక్షన్‌ ఆలోచనలు థియేటర్లు దద్దరిల్లేలా చేస్తాయి. అందుకే ఇద్దరూ కలసి ఇప్పటికే హ్యాట్రిక్‌ కొట్టారు. ఇప్పుడు సెకండ్‌ హ్యాట్రిక్‌ షురూ చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో మరో కామన్‌ పాయింట్.. బాలయ్య సినిమాలో వాడే వాహనం. ప్రత్యేకమైన డిజైన్‌లో ఆ వెహికిల్స్‌ రెడీ అవుతుంటాయి. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ సినిమాలో కూడా అలాంటి వాహనం ఒకటి ఉంది.

Akhanda 2

‘అఖండ-2’ సినిమా కోసం కూడా బోయపాటి శ్రీను ప్రత్యేకంగా ఓ వాహనాన్ని డిజైన్‌ చేయించారు. రాక్స్‌ అనే పేరుతో డిజైన్‌ చేసిన ఆ వాహనం సినిమాలో బాలకృష్ణ పాత్రకి ప్రతిబింబంలా ఉంటుందని చెబుతున్నారు. ఎక్స్‌ డ్రైవ్‌ సంస్థ ఈ వాహనాన్ని సిద్ధం చేసింది. దానికి ఎక్స్‌ స్టూడియోస్‌ సినిమాటిక్‌ లుక్‌ని తీసుకొచ్చింది. ఆ స్పెషల్‌ వెహికల్‌ని ఇటీవల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రదర్శించారు. దీంతో ఆ వాహనం ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

వెండితెరపై ఈ వాహనాన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ఒక శక్తిమంతమైన పాత్ర కోసం ఈ వెహికల్‌ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించాం. పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటుందో, ఈ వాహనం కూడా అలాగే ఉంటుంది. ఈ వాహనం కోసం అమర్‌ నాలుగు రోజుల్లో డిజైన్‌ చేసి అందించారని బోయపాటి చెప్పారు. ఇక ఇప్పటివరకు బోయపాటి సినిమాల కోసం అమర్‌ ఎనిమిది వాహనాలు డిజైన్‌ చేసి ఇచ్చారట.

ఇక బోయపాటి – బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన ‘లెజెండ్‌’ సినిమాలోని స్పెషల్‌ బైక్‌ని సినిమా రిలీజ్‌ తర్వాత ప్రత్యేకంగా మీడియా ముందుకు, ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇప్పుడు ‘అఖండ 2: తాండవం’ కోసం వెహికల్‌ను రిలీజ్‌కి ముందే తీసుకొచ్చేశారు. మరి థియేటర్‌లో ఈ వాహనాన్ని ఎలాంటి స్పందన వస్తుందేమో చూడాలి. అలాగే ఈ వెహికల్‌కి ఏదో పేరు ఉందని.. సినిమాలోనే అది తెలుస్తుందని సమాచారం.

మేజర్‌ ‘రియల్‌’ పేరెంట్స్‌ను కలిసిన హీరో.. ఫొటోలు, కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus