మహేష్ ఫ్యాన్స్ కి స్పెషల్ సర్ప్రైజ్!

గతేడాది ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ ఏడాదిలోనే సినిమాను రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లడంలో ఆలస్యం జరగడంతో విడుదల విషయంలో ఆలస్యం జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఇప్పట్లో ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్లు ఉండవని ఫిక్స్ అయిపోయారు.

కానీ ఇప్పుడు మహేష్ ఫ్యాన్స్ కోసం ఓ స్పెషల్ సర్ప్రైజ్ ఇవ్వాలని నిర్ణయించుకుందట మహేష్ అండ్ టీమ్. ‘సర్కారు వారి పాట’ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ఒకటి దుబాయ్ లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. దాదాపు 25రోజుల పాటు ఈ షెడ్యూల్ ని ప్లాన్ చేశారు. అక్కడ షూటింగ్ పూర్తి చేసుకున్నాక దుబాయ్ డైరీస్ పేరుతో ఓ స్పెషల్ వీడియోను వదలబోతుందట యూనిట్. షూటింగ్ లొకేషన్లతో పాటు ఆన్ లొకేషన్స్ ముచ్చట్లతో ఈ వీడియో రూపొందనుందట. ఈ వీడియో మహేష్ లుక్ ను స్వల్పంగా రివీల్ చేస్తారట. కాస్ట్ అండ్ క్రూను చూపిస్తూ..

సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఈ వీడియోను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. మహేష్ అభిమానులకు ఇదొక ట్రీట్ అని.. ఫస్ట్ లుక్ వచ్చే వరకు ఈ వీడియో వాళ్లను ఎంగేజ్ చేస్తుందని భావిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus