టాలీవుడ్ యువ హీరో…అభిమానులు ‘డార్లింగ్’ అంటూ ముద్దుగా పిలుచుకునే కధానాయకుడు ప్రభాస్….దాదాపుగా ప్రభాస్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 14ఏళ్లు పూరీ అయినప్పటికీ…ఆయన ఫ్యాన్ బేస్ రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది….ఇంకా చెప్పాలి అంటే అన్ని సినిమా పరిశ్రమలకు సుపరిచితం అయితే అతి కొద్దిమంది హీరోల్లో ప్రభాస్ ఒకరు అంటే అతిశయోక్తి కాదు…మరి అలాంటి పని రాక్షసుడి గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు చూద్దాం రండి….
మూడేళ్ళ సాధనసినిమా అంటే చాలా సింపిల్…హీరోల లైఫ్ చాలా సూపర్ అని అనుకునే వాళ్ళకు ప్రభాస్ డెడికేషన్ చూస్తే అసలు హీరో అంటే ఏంటో అర్ధం అవుతుంది. ఒకటి కాదు రెండు కాదు…మూడేళ్ళ నుంచి ప్రభాస్ బహుబలి కోసం చాలా కష్ట పడుతున్నాడు…మరే సినిమా ఒప్పుకోకుండ దర్శకుడు రాజమౌళి చెప్పిన విధంగా తనని తాను మలుచుకుంటూ, ముందుకు పోతున్నాడు….అతి కొద్ది మంది హీరోలకు ఉండే ఆ డెడికేషన్ ప్రభాస్ కు ఉండడం నిజంగా మన అదృష్టం.
‘మిస్టర్ వర్ల్డ్ ‘ శిక్షణలోఇష్టం ఉన్న పని ఎంత కష్టమైనా చెయ్యాలి అని అనిపిస్తుంది అంటారు…బహుశా ప్రభాస్ ఆది బాగా నమ్ముతాడు అనుకుంట…రోజులో ఎక్కువ శాతం బాడీ ని షేప్ చేసుకోవడానికే వాడటం, జిమ్ చేసే సమయంలో ఫుడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం, అంతేకాదు అన్నింటికన్నా ముఖ్యంగా 2010 లో మిస్టర్ వర్ల్డ్ గా ఎంపికైన లక్ష్మణ్ రెడ్డి శిక్షణలో కసరత్తులు చెయ్యడం, తాను ఒప్పుకున్న పాత్ర కోసం 82కిలోల నుంచి 104కిలోలకు బాడీని పెందుకోవడం, ఇలా తనను తానే తన సినిమా కోసం మలచువడంతో నిజంగా ప్రభాస్ కు సినిమా పట్ల ఉన్న శ్రద్దని భక్తినీ తెలియజేస్తుంది.
తొలి”హిట్”కు మూడేళ్లుసహజంగా టాలీవుడ్ లో ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్నా…సక్సెస్ ను చవి చూడడం అంటే కాస్త టఫ్ అంటే చెప్పాలి…చాలా మంది వారసులు హిట్ కోసం ఎన్నో సినిమాలు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది….అయితే ప్రభాస్ సైతం అదే కోవలోకి వస్తాడు….తొలి సినిమా ఈశ్వర్, మలి సినిమా రాఘవేంద్ర రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చెయ్యలేదు,అయితే 2014 సంక్రాంతి బరిలో నిలిచిన వర్షం మాత్రం సూపర్ హిట్ అయ్యీ ప్రభాస్ ను టాలీవుడ్ టాప్ హీరో రేస్ లో నిలబెట్టాయి. ఇక అక్కడి నుంచి మొదలయింది ప్రభాస్ జైత్రయాత్ర.
బాహుబలికి ముందే బాలీవుడ్ లోఅసలైతే ప్రభాస్ బహుబలితో అటు బాలీవుడ్ లోను చక్రం తిప్పాడు అని అందరూ అనుకుంటారు…కానీ ఆ ఆలోచనలో అసలు నిజాన్ని మరచిపోతున్నారు…..2014లోనే ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేశాడు..అజేయ్ దేవగన్, సోనక్షి సిన్హ కలసి నటించిన “యాక్షన్ జాక్సన్”సినిమాలో ప్రత్యేక పాత్రలో ఎంట్రీ ఇచ్చాడు మన మిర్చి కుర్రాడు. అంతేకాదు…ఆ సినిమాలో ‘పుంజాబ్ మస్త్’ అనే పాటలో మన సోనక్షి బేబీ తో ఆడి పాడాడు కూడా…
నచ్చే సినిమాలు…దర్శకులుప్రభాస్ కు నచ్చే దర్శకులు ఎవరంటే….టాలీవుడ్ లో తన పెద్దనాన్న నటించిన ‘భక్త కన్నప్ప’ సినిమా అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం అట..అంతేకాదు…ఇక బాలీవుడ్ కు వస్తే…రాజ్‌కుమార్ హిరానికి ప్రభాస్ చాలా పెద్ద ఫ్యాన్ అంట…ఆయన తీసిన మున్నాభాయ్ ఎంబీబీఎస్, 3 ఈడియాట్స్ సినిమాలు అయితే దాదాపుగా 20సార్లు పైనే చూసాడట. ఇక హాలీవుడ్ కు వస్తే…రాబర్ట్ డీ నిరొ అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం అని తెలుస్తుంది.
చూపుల్లోనూ….చదువులో డార్లింగ్…సూపర్ప్రభాస్ చాలా మంది హీరోలు లాగా, సినిమాపై ఇష్టంతో చదువు మానేసి ఇండస్ట్రీ లోకి దూకెయ్య లేదు….తన ఇంజినీరింగ్ పూర్తి చేసిన తరువాతనే ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు…తన ఇంజినీరింగ్ ను హైదరాబాద్ లోని శ్రీ చైతన్య కాలేజ్ లో పూర్తి చేశాడట.
కుటుంబం అంటే ప్రాణం..ఎంత పెద్ద హీరో అయిన…ఎంత సంపాదించిన…కుటుంభ విషయంలో ప్రభాస్ చాలా యాక్టివ్. తన కుటుంభం అన్నా…తన వాళ్ళు అన్నా ప్రభాస్ కు పిచ్చి. ఇంకా కుటుంబంలో తన తల్లి అంటే ప్రభాస్ కు చాలా ఇష్టం, రోజులో కాసేపైనా ఆమెతో స్పెండ్ చెయ్యకుండా ప్రభాస్ ఉండలేడు. అంటే మన డార్లింగ్ అమ్మ కొడుకు అన్న మాట.