సోనుసూద్ కు దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ అరుదైన గౌరవం !!!

  • March 20, 2021 / 02:59 PM IST

నటుడు సోనూ సూద్ కరోనా కష్టకాలంలో చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  కష్టాల్లో ఉన్నవారి కోసం ఆయన వేసిన ముందడుగు ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది.  ఆయన్ను ఆదర్శంగా తీసుకుని అనేకమంది సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు.  తమవంతు సహాయాన్ని అందించారు.  వలస కూలీలను, విదేశాల్లో చిక్కుకున్న పేద భారతీయులను, విద్యార్థులను ఇండియాలోని వారి వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ కృషి మరువలేనిది.  ఆయన చూపిన చొరవ మూలంగా ఎందరో తమవారిని చేరుకున్నారు.  లాక్ డౌన్ మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న అనేక మంది సోనూ సూద్ సాయంతో ఊరట పొందారు.  సోనూ సేవలకు దేశం మొత్తం ఆయన్ను కొనియాడింది.  సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు కొనియాడారు.

ఆయన చేసిన సేవలకు గౌరవంగా దేశీయ విమానయాన సంస్థ స్పైస్ జెట్ బోయింగ్ 737 విమానం మీద సోనూ సూద్ బొమ్మను వేశారు.  ఏ సెల్యూట్ టూ సేవియర్ సోనూ సూద్ అనే క్యాప్షన్ వేశారు.  ఇలా దేశీయ విమానయాన సంస్థ సొంత ఖర్చులతో ఒక వ్యక్తికి గౌరవార్థంగా ఇలా చేయడం ఇదే తొలిసారి.  లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్, స్పైస్ జెట్ సంస్థ సంయుక్తంగా పూనుకుని 2.5 లక్షల మంది భారతీయులను స్వస్థలాలకు చేర్చారు.  రష్యా, ఉజెబికిస్థాన్, మనిల, ఇంకొన్ని దేశాల్లో చిక్కుకుపోయిన 1500 మంది భారతీయ విద్యార్థులను ఇండియాకు తీసుకొచ్చారు.

స్పైస్ జెట్ సంస్థ తనకు ఇచ్చిన ఈ గౌరవం పట్ల సోనూ సూద్ చాలా సంతోషంగా ఉన్నారు.  తనతో కలిసి లాక్ డౌన్ సమయంలో స్పైస్ జెట్ చేసిన సేవలను గుర్తుచేసుకున్న సూనూ సూద్ ఇక మీదట కూడ ఇలాగే తన సేవా కార్యక్రమాలతో అందరినీ గర్వపడేలా చేయడానికి కృషి చేస్తానని అన్నారు.

1

2

3

4

Most Recommended Video

చావు కబురు చల్లగా సినిమా రివ్యూ & రేటింగ్!
మోసగాళ్ళు సినిమా రివ్యూ & రేటింగ్!
శశి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus