పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ది రాజా సాబ్’ రిలీజ్ హడావిడిలో ఉన్నాడు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో డార్లింగ్ ప్రభాస్ అలాగే హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్..లతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో ‘రాజా సాబ్’ ముచ్చట్లతో పాటు సందీప్ వంగా డైరెక్షన్‌లో ప్రభాస్ చేయబోయే ‘స్పిరిట్'(Spirit) సినిమా గురించి కూడా మైండ్ బ్లోయింగ్ విషయాలపై చర్చించుకున్నారు.
రీసెంట్‌గా న్యూ ఇయర్‌కి వచ్చిన ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. దీనిపై ప్రభాస్ ఫస్ట్ టైమ్ రియాక్ట్ అయ్యాడు. తన కెరీర్‌లోనే ఇది ‘బెస్ట్ అండ్ కల్ట్ పోస్టర్’ అని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ని ఇంకా కొత్తగా, ‘రా’గా ఎలా చూపించాలా అని ఆలోచించి, సందీప్ ఈ ఐడియాతో వచ్చాడట. మొదట్లో సందీప్ తనను ఎలా చూపిస్తాడో అని ప్రభాస్ కాస్త టెన్షన్ పడ్డాడట. కానీ అవుట్ పుట్ చూశాక ఫిదా అయిపోయానని చెప్పాడు.

అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఆ పోస్టర్ కోసం సపరేట్ గా ఫోటో షూట్ చేయలేదట. అది సినిమాలో ఉండే ఒక సీన్ నుంచి కట్ చేసిన షాట్. సందీప్ వంగా ఈ లుక్ గురించి మాట్లాడుతూ ఒక క్రేజీ డిటైల్ లీక్ చేశాడు. ‘ఆ పోస్టర్ లో ప్రభాస్ చేతిలో మీకు కనిపిస్తుంది గ్లాస్ లాగా ఉంటుంది.. కానీ అది నిజానికి ఒక లీటర్ మందు బాటిల్’ అని రివీల్ చేశాడు.పోస్టర్‌లో ప్రభాస్ పక్కనే నిల్చుని సిగరెట్ వెలిగిస్తూ కనిపిస్తున్న తృప్తి దిమ్రి క్యారెక్టర్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశాడు సందీప్.
ఆమె ఇందులో ప్రభాస్ భార్యగా కనిపించబోతోందని చెప్పకనే చెప్పేశాడు. ఒక పక్క గాయాలతో ఉన్నా, భార్యతో సిగరెట్ వెలిగించుకుంటున్న ఆ సీన్ సినిమాలోని ఇంటెన్సిటీని చూపిస్తుంది. తర్వాత ‘ది రాజా సాబ్’ గురించి మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత పాత ‘డార్లింగ్’ సినిమా వైబ్స్ ఇందులో ఉంటాయని ప్రభాస్ చెప్పాడు. వరుసగా సీరియస్ యాక్షన్ సినిమాలు చేసి బోర్ కొట్టి, ఆడియెన్స్‌ని నవ్వించడం కోసం మారుతితో ఈ హారర్ కామెడీ ప్లాన్ చేశాడట.
