పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ‘అర్జున్ రెడ్డి’ ‘కబీర్ సింగ్’ ‘యానిమల్’ వంటి సినిమాలతో సందీప్ కూడా పాన్ ఇండియా రేంజ్లో స్టార్ డైరెక్టర్ అయ్యి కూర్చున్నాడు. దీంతో ‘స్పిరిట్’ పై మొదటి నుండి భారీ హైప్ ఏర్పడింది. ఈ ప్రాజెక్టు అనౌన్స్ చేసి 3 ఏళ్ళు దాటినా.. ఇంకా సెట్స్ పైకి వెళ్ళింది లేదు.
అందుకు కారణం.. ప్రభాస్ కాల్షీట్స్. అతను వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఒకేసారి 4 పాన్ ఇండియా సినిమాల షూటింగ్లలో పాల్గొంటున్నాడు.’స్పిరిట్’ షూటింగ్లో కూడా అతను అలాగే పాల్గొనడం అనేది దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకి ఇష్టం లేదు. ప్రభాస్ ‘స్పిరిట్’ అంటూ ప్రత్యేకంగా డేట్స్ కేటాయించాలి. సినిమా కంప్లీట్ అయ్యేవరకు అదే లుక్ మెయింటైన్ చేయాలి.

దాని కోసం ఎన్ని రోజులైనా వెయిట్ చేసేందుకు సందీప్ రెడీ. అతను కాంప్రమైజ్ అయ్యే రకం కాదు.సరే ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘స్పిరిట్’ నుండి ప్రభాస్ బర్త్ డే కానుకగా ఒక అప్డేట్ వచ్చింది. ఓ ఆడియో క్లిప్ ను విడుదల చేశారు. దాని ద్వారా సినిమా కథపై హింట్ కూడా ఇచ్చారు. ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ గా కనిపించబోతున్నట్టు ముందు నుండి ప్రచారం జరుగుతుంది. అది నిజమే అని ఈ ఆడియో క్లిప్ తో స్పష్టం చేశారు.
అంతేకాదు అతను జైలుకు వెళ్లి ఖైదీ కూడా అవుతాడని స్పష్టం చేశారు.అలాగే ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్లో హీరో క్యారెక్టర్ ఎంత రఫ్ గా, బోల్డ్ గా ఉంటుందనేది కూడా రివీల్ చేశారు. ఈ ఆడియో ఫైల్ రేంజ్ ని పది శాతం మెయింటైన్ చేసినా.. సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయం.
