వెబ్‌సిరీస్‌ల్లో స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ వేరయా అంటారు.. వెబ్‌సిరీస్ ప్రేమికులు. అంతలా ప్రేక్షకుల్ని అలరించింది ఆ వెబ్ సిరీస్. వినడానికి చిన్నపిల్లల ఆటలా ఉన్నా.. ప్రేక్షకుడిని సీన్ బై సీన్ ఉత్కంఠకు గురిచేసిన కొరియన్ వెబ్ సిరీస్ ఇది. అలాంటి వెబ్ సిరీస్ రెండో పార్ట్ రాబోతోంది. ఈ మేరకు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. త్వరలో ‘స్క్విడ్ గేమ్ 2’ చూస్తారు అని తెలిపింది. మరోవైపు దర్శకుడు వాంగ్ డోంగ్ యోక్ కూడా దీని గురించి సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి… అందరూ అవాక్కయ్యేలా విజయాన్ని అందుకుంది ‘స్క్విడ్ గేమ్’. చూస్తుండగానే రికార్డులు మీద రికార్డులు బద్దలు కొట్టింది. నెట్‌ఫ్లిక్స్‌లో కొన్ని రోజుల్లోనే 111 మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే ఎంతటి విజయం సాధించిందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కొంతమందిని సెలక్ట్ చేసుకుని, డబ్బు ఆశ చూపి వారి ప్రాణాలతో ఓ వ్యక్తి ఆడే ఆట… ఈ వెబ్‌సిరీస్ కాన్సెప్ట్. అయితే ఆ గేమ్‌ను, అందులోని ఎమెషన్స్‌ని చూపించిన విధానం అందరిలో ఉత్సుకత రేకెత్తించేలా చేసింది.
ఈ ఆటలో మొదటి రౌండ్‌లోని ‘గ్రీన్ లైట్.. రెడ్ లైట్’ అనే కాన్సెప్ట్ వేరే లెవల్‌లో ఉంటుంది. ఆ సిరీస్‌కు కొనసాగింపుగా ‘స్క్విడ్ గేమ్ 2’ రూపొందిస్తున్నట్లు ఆ సిరీస్ దర్శకుడు వాంగ్ డోంగ్ యోక్ అధికారికంగా ప్రకటించారు. ఇందులో రౌండ్స్ కొత్తగా ఉంటాయని, ప్రతి క్షణం ఉత్కంఠకు గురి చేసేలా ఉంటుందని చెప్పారు. ‘స్క్విడ్ గేమ్’ను గతేడాది మీ ముందుకు తీసుకురావడానికి 12 ఏళ్లు కష్టపడ్డాం. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో మోస్ట్ పాపులర్ షోగా పేరు తెచ్చుకోవడానికి 12 రోజులు మాత్రమే పట్టింది.
ఇంతటి ఘన విజయాన్ని అందించినందుకు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని చెప్పారు. ఇప్పుడు జి హన్ రిట్నర్స్, ది ఫ్రెంట్ మేన్ రిట్నర్స్, సీజన్ 2 వచ్చేస్తోంది అని చెప్పారు. సూట్ ధరించి గేమ్ ప్రారంభించే డీడాగ్జి మళ్లీ తిరిగి రావొచ్చు. CHEOL-SU (గేమ్ లోని మరబొమ్మ) బాయ్‌ఫ్రెండ్ యోంగ్ హి కూడా ఈసారి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరో సరికొత్త గేమ్ కోసం మాతో కలవండి అని ఆయన రాసుకొచ్చారు. అయితే ఈ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పటి నుండి అనేది తెలియాల్సి ఉంది.
Most Recommended Video
అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!