Sr NTR: యాడ్‌లో నటించడానికి నటరత్న ఎన్టీఆర్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో తెలుసా..!

నటరత్న ఎన్టీఆర్.. తెలుగు ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు.. తెలుగు చరిత్ర ఉన్నంతకాలం చెప్పుకునే పేరు.. తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన వెండితెర కథానాయకుడు.. తిరుగులేని ప్రజా నాయకుడు.. తెలుగు వారి రాముడు, కృష్ణుడు ఆయనే.. పౌరాణిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలలో జీవించిన తారక రాముడు ప్రేక్షకుల మనసుల్లో చెరుగని ముద్ర వేశారు.. ఆయన చిత్రాలు, పాత్రలు, సృష్టించిన చరిత్రలు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అద్భుతం.. అజరామరం..

1923 మే 28న నిమ్మకూరులో జన్మించిన ఆ మహనీయుడి శత జయంతి సంవత్సరం ఇది.. ఈ సందర్భంగా ఎన్టీఆర్ గురించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.. వాటిలో ఆయన ప్రకటనలో నటించారనే వార్త ఒకటి వైరల్ అవుతోంది.. ఈ విషయం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు.. ఆక ఆ యాడ్‌లో యాక్ట్ చేసినందుకు గానూ రామారావు భారీ పారితోషికం అందుకున్నారట.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

ఎన్టీఆర్ నటించిన యాడ్.. విజయా కెమికల్స్ వారి అశోకా ఆమ్లా బ్రిలియంటైన్ బ్రాండ్‌కి చెందినది.. ఆ ప్రకటనకు సంబంధించిన పేపర్ కటింగ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.. క్లారిటీగా అర్థం కావట్లేదు కానీ ఇది హెయిర్ ఆయిల్ లేదా హెయిర్ స్ప్రే అనిపిస్తోంది.. అశోకా ఆమ్లాలో ఉన్న ఔషదాల వల్ల మెదడుకి, కళ్లకి చల్లదనంతో పాటు.. రోజంతా హెయిర్ సువాసన వెదజల్లుతుందని.. ఇది స్త్రీ, పురుషులకు ఉత్తమ శిరోజాలంకరణ సాధనము అని ఉంది..

ఇక వారి బ్రాండ్‌ని ప్రమోట్ చేసినందుకు గానూ.. ఆయనకు అక్షరాలా ఒక లక్ష రూపాయలు పారితోషికంగా ఇచ్చారట.. అప్పట్లో ఇది చాలా పెద్ద అమౌంట్.. ఇక రామారావు నటించలేదు కాబట్టి బాలయ్య కూడా యాడ్స్ చెయ్యడు అని చాలా కాలం టాక్ ఉండేది.. కట్ చేస్తే.. టాక్ షోతో షాకిచ్చిన బాలయ్య.. యాడ్స్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశాడు.. ఇప్పటికే రియల్ ఎస్టేట్ (సాయిప్రియ కన్‌స్ట్రక్షన్స్) ప్రకటనలతో అలరించి.. ఇటీవలే వేగ జువెలర్స్ యాడ్ కూడా కంప్లీట్ చేశాడు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus