బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో రాయలసీమ బిడ్డగా ఎంట్రీ ఇచ్చింది స్రవంతి చొక్కారపు. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ వల్లే ఈ అవకాశాన్ని దక్కించుకుంది. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి వారం పెద్దగా పెర్ఫామ్ చేసే అవకాశం రాలేదు. మెల్లగా నామినేషన్స్ నుంచీ దూరంగా ఉంది. అఖిల్ , అజయ్, ముమైత్, అషూరెడ్డి టీమ్ తో కలిసింది. ముఖ్యంగా అఖిల్ కి మంచి ప్రెండ్ గా ఉండటం వల్లే నామినేషన్స్ లోకి వచ్చిన వారం సేఫ్ అయ్యింది.
ఆ తర్వాత నామినేషన్స్ లోకి వచ్చినపుడు ఎలిమినేట్ అయిపోతుందనే అందరూ అనుకున్నారు. కానీ, బతికిపోయింది. ఆ తర్వాత అనూహ్యంగా తేజస్వి ఎలిమినేషన్ వల్ల స్రవంతికి మరో అవకాశం వచ్చింది. దీంతో ఆరువారాల పాటు హౌస్ లో తనేంటో నిరూపించుకునే ప్రయత్నం చేసింది. గేమ్ పరంగా చూస్తే టాస్క్ లలో పెద్దగా పెర్ఫామ్ చేయలేదు స్రవంతిద. తనకి నచ్చినట్లుగానే గేమ్ ఆడింది. ఛాలెంజర్స్ గా వారియర్స్ పైన గెలిచిన సందర్భం కూడా లేదు.
ఆర్జే చైతూ ఛాలెంజర్స్ టీమ్ ని లీడ్ చేస్తున్నా కూడా స్రవంతి మాత్రం సీనియర్స్ తో కలిసి ఉంది. అంతేకాదు, వేరేవాళ్ల గేమ్ ని సరిగ్గా ఎనలైజ్ చేస్కోలేకపోయింది. టాస్క్ లలో ఎగ్రెసివ్ పెర్ఫామన్స్ కూడా ఇచ్చిన సందర్భమే లేదు. సరయుతో గొడవ పడటం, మళ్లీ కలిసిపోవడం, తర్వాత నటరాజ్ మాస్టర్ తో గొడవపడటం అనేది స్రవంతి గేమ్ ని దెబ్బకొట్టింది. ఎంతసేపు ఆర్గ్యూమెంట్ పైన ఉన్న శ్రద్ధ టాస్క్ పైన పెట్టలేదు.
ఆ తర్వాత లగ్జరీ బడ్జెట్ టాస్క్ లలో కానీ, కెప్టెన్సీ టాస్క్ లో కానీ ఎక్కడా కూడా తన గేమ్ ని చూపించలేదు. స్రవంతి గేమ్ పరంగా చూస్తే నామినేషన్స్ లో కూడా ఎక్కడా లాజిక్స్ వర్కౌట్ చేయలేదు. తనకి ఏమనిపించింది అనేది మాత్రమే చెప్తూ నామినేట్ చేసిందే తప్ప, గేమ్ లో వాళ్లేంటి అనేది ఎనలైజ్ చేయలేకపోయింది. ట్రక్ టాస్క్ లో కూడా ఒక్కసారి కూడా హారన్ సంపాదించలేకపోయింది.
అలాగే, తనకి ఉన్న హెల్త్ ఇష్యూ వల్ల కొన్ని టాస్క్ లకి దూరంగా ఉంది. ఇది కూడా స్రవంతి గేమ్ ని దెబ్బకొట్టింది. అయినా కూడా ఆరు వారాల పాటుగా హౌస్ లో తనదైన స్టైల్లో గేమ్ ఆడింది స్రవంతి. తన భాష, యాస ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంది. అదీ మేటర్.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!