Sree Vishnu Interview: ఇంటర్వ్యూ : ‘శ్వాగ్’ పక్కా ఫ్యామిలీ మూవీ.. కంటెంట్ పై నమ్మకం ఉంది : శ్రీవిష్ణు

శ్రీవిష్ణు (Sree Vishnu) సినిమా అంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన అంచనాలు ఉంటాయి. అతని కెరీర్ ప్రారంభం నుండి వైవిధ్యమైన సినిమాలే చేస్తూ వస్తున్నాడు. ఎంతో మంది టాలెంటెడ్ డైరెక్టర్స్ ను కూడా ఇండస్ట్రీకి అందించాడు. అందులో హసిత్ గోలి (Hasith Goli) కూడా ఒకడు. ఆల్రెడీ వీరి కాంబినేషన్లో ‘రాజ రాజ చోర’ (Raja Raja Chora) అనే సినిమా వచ్చింది. అది మంచి సక్సెస్ అందుకుంది. ఇక రెండో సినిమాగా ‘శ్వాగ్’ (Swag)  చేశారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (T. G. Viswa Prasad) ఈ చిత్రాన్ని నిర్మించారు.

రీతూ వర్మ హీరోయిన్ (Ritu Varma)గా నటించిన ఈ చిత్రంలో మీరా జాస్మిన్ (Meera Jasmine) దక్ష నాగర్కర్ (Daksha Nagarkar) వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 4న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మీడియా సమావేశంలో పాల్గొని… ‘శ్వాగ్’ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు హీరో శ్రీవిష్ణు (Sree Vishnu) . అవి మీ కోసం :

Sree Vishnu

ప్ర) ‘శ్వాగ్’ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి?

శ్రీవిష్ణు : శ్వాగ్.. అంటే శ్వాగనిక వంశానికి సుస్వాగతం అని.! అలా పలకడం కష్టంగా ఉంటుందని ‘శ్వాగ్’ అని పెట్టాం.

ప్ర) ‘శ్వాగ్’ టీజర్, ట్రైలర్స్ ఆకట్టుకున్నా.. కథపై చాలా మందికి ఓ కన్ఫ్యూజన్ ఉంది?

శ్రీవిష్ణు : ఇది ఒక వంశానికి సంబంధించిన కథ. 1500 సంవత్సరంలో మగ గొప్పా ? ఆడ గొప్పా ? అనే అంశంపై రాసిన టిట్ ఫర్ టాట్ లాంటి కథ. తెలుగు ప్రేక్షకులు కొత్తదనాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తారు అనే నమ్మకంతో చేశాం.

ప్ర) ఈ సినిమాలో 4 రకాల పాత్రల్లో కనిపిస్తున్నారు? ఎలాంటి హార్ట్ వర్క్ చేశారు?

శ్రీవిష్ణు : నేను డబుల్ రోల్, డ్యుయల్ రోల్ వంటివి ఇప్పటివరకు చేయలేదు. కానీ ఇందులో 4 పాత్రలు చేయాల్సి వచ్చింది. సో ఇది పెద్ద ఛాలెంజ్ గా అనిపించింది. గెటప్పులు అన్నీ సెట్ అయ్యాక.. పర్వాలేదు అనిపించింది.

ప్ర) ఇందులో కొన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. కానీ మీ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు? కాబట్టి వాళ్ళకి ఇబ్బందిగా అనిపించదా?

శ్రీవిష్ణు : ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అంతా చూసి ఎంజాయ్ చేయదగ్గ కథ. ముఖ్యంగా పెద్దవాళ్ళకి సినిమా విపరీతంగా నచ్చుతుంది. యూత్ ను మెప్పించే ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ జనరేషన్ తెలుసుకోవాల్సిన చాలా విషయాలు ఇందులో ఉన్నాయి.

ప్ర) ‘రాజ రాజ చోర’ తర్వాత హసిత్ గోలి అలాగే పీపుల్ మీడియాతో కలిసి ఈ సినిమా చేశారు. ఆ సినిమా పోలికలు ఇందులో ఉంటాయా?

శ్రీవిష్ణు : వాస్తవానికి ‘రాజ రాజ చోర’ కి ప్రీక్వెల్ గా భావించి ఈ సినిమా చేయాలని అనుకున్నాం. కానీ తర్వాత ప్రీక్వెల్ ఆలోచన మానుకుని.. ‘శ్వాగ్’ గా చేశాం. ఆ సినిమాలోని కొన్ని పాత్రలు ఇందులో కూడా ఉంటాయి. నాకు, దర్శకుడు హాసిత్ కి ‘పీపుల్ మీడియా’ వారు బాగా సహకరించారు.

 

ప్ర) ఇందులో ‘ఫెమినిస్ట్’..లను ఇబ్బంది పెట్టే డైలాగులు ఎక్కువగా ఉన్నాయంటున్నారు?

శ్రీవిష్ణు : ఉన్నాయి. కానీ బ్యాక్ స్టోరీస్ కూడా బాగా సెట్ అయ్యాయి. రీతూ వర్మ క్యారెక్టర్ ట్రాన్స్ ఫర్మేషన్ చూశాక వాళ్ళు కూడా హ్యాపీగా ఫీలవుతారు.

ప్ర ) అక్టోబర్ 4 సరైన రిలీజ్ డేట్ అనుకుంటున్నారా?

శ్రీవిష్ణు : ఈ వారం సినిమాలు ఏవీ లేవు కదండీ..!(నవ్వుతూ)

ప్ర) గత వారం రిలీజ్ అయిన ‘దేవర’ ‘సత్యం సుందరం’ బాగా రన్ అవుతున్నాయి. అలాగే వచ్చే వారం కూడా చాలా సినిమాలు వస్తున్నాయి?

శ్రీవిష్ణు : నిజమే కానీ.. ఇప్పట్లో సోలో రిలీజ్ కావాలంటే కష్టం. (నవ్వుతూ)

ప్ర) సో హ్యాట్రిక్ కొట్టేస్తారనే నమ్మకం ఉందా?

శ్రీవిష్ణు : మంచి కంటెంట్ తో సినిమా చేశాము. హిట్ అవుతుందనే నమ్మకం అయితే ఉండదు. హ్యాట్రిక్ సంగతి తర్వాత..!

ప్ర) మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి?

శ్రీవిష్ణు : ప్రస్తుతం ఒక థ్రిల్లర్ మూవీ చేస్తున్నాను. అలాగే ‘గీతా ఆర్ట్స్’ లో కూడా ఓ సినిమా చేస్తున్నాను. 50 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది.

– Phani Kumar

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus