Raja Raja Chora Movie: శ్రీవిష్ణు కాన్ఫిడెన్స్ అస్సలు తగ్గడం లేదుగా… !

ఇప్పుడున్న ట్యాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు ఒకరు.మొదట్లో ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ మూవీలో, అలాగే నారా రోహిత్, అల్లు అర్జున్ వంటి హీరోల సినిమాల్లో అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసాడు. అటు తర్వాత హీరోగా మారి ‘సెకండ్ హ్యాండ్’ ‘మా అబ్బాయి’ వంటి సినిమాల్లో నటించాడు. అయితే ‘మెంటల్ మదిలో’ ‘నీదీ నాదీ ఒకే కథ’ ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ‘బ్రోచేవారెవరురా’ వంటి సినిమాలు ఇతని ఇమేజ్ ను పెంచాయి. రేపు ‘రాజ రాజ చోర’ అంటూ మరో కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు శ్రీవిష్ణు.

అయితే ఇప్పటి వరకు అతను చేసిన సినిమాలకు సంబంధించి శ్రీవిష్ణు పెద్దగా హడావిడి చేసింది లేదు. తక్కువగా మాట్లాడినా అతని డౌన్ టు ఎర్త్ స్వభావం కనిపిస్తుంది. కానీ ‘రాజ రాజ చోర’ ప్రీ రిలీజ్ వేడుకలో అతని స్పీచ్ చాలా విమర్శలకు దారి తీసింది. ఇప్పటికీ నెటిజన్లు అతని స్పీచ్ ను బట్టి ట్రోల్ చేస్తున్నారు. ఈ విషయం పై శ్రీవిష్ణు స్పందిస్తూ.. “ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేను ఎక్కువగా మాట్లాడిన మాట వాస్తవమే.అయితే ఈ చిత్రం క‌థ వ‌ల్ల వచ్చిన కాన్ఫిడెన్స్‌ నాతో అలా మాట్లాడించింది. నిజంగా కథ బాగా కుదిరింది. దాని గురించి ఇప్పుడు ఎక్కువ‌గా చెప్ప‌కూడ‌దు.

నేను నటించే సినిమాల్లో ఏమేం ఉంటుంది.. అనే విషయాలను చెప్పి జనాలను ప్రిపేర్ చేయడం నా అలవాటు.ఈ సినిమా విష‌యంలో కూడా అంతే నిజాయ‌తీగాగా ఉండాల‌నిపించింది. ఈ మూవీలో సిద్ శ్రీ‌రామ్ ఓ పాట పాడారు. ఆ విషయాన్ని మేము ఎక్క‌డా రివీల్ చేయ‌లేదు. థియేట‌ర్లో చూస్తేనే ఓ కిక్ వ‌స్తుంద‌ని.. ఆ పాటని అలా దాచేశాం.ఇప్పుడు బ‌య‌ట ప‌రిస్థితి ఏమీ బాలేదు. థియేట‌ర్ల‌కు రావడానికి జనాలు చాలా భ‌య‌ప‌డుతున్నారు.సో నేను కాన్ఫిడెంట్ గా మాట్లాడితేనే జ‌నాలు థియేట‌ర్ల‌కు వ‌స్తారనిపించింది. నేనేం మాట్లాడినా.. మ‌న‌సుతోనే మాట్లాడాను” అంటూ చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus