సినిమాతో ఇటు గ్లామర్‌గా, అటు నటన పరంగా మంచి పేరు తెచ్చుకుంది రెబా మోనికా జాన్ (Reba Monica John) . ‘సామజవరగమన’ (Samajavaragamana) సినిమాతోనే ఇది సాధ్యం చేసుకుంది రెబా మోనికా. అప్పటికే ఆమె మనకు ‘విజిల్’ (Bigil) సినిమాతో మనకు పరిచయమే. అయితే ‘సామజవరగమన’తోనే ఆమె హీరోయిన్‌గా మన దగ్గరకు వచ్చింది. ఆ సినిమా విజయం తర్వాత వరుస ఛాన్స్‌లు సంపాదిస్తుంది అని వార్తలొచ్చినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ లోపు ఆమె ఓ ఐటెమ్ సాంగ్‌కి రెబా మోనికా ఓకే చెప్పింది అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది.
Reba Monica John
నార్నె నితిన్(Narne Nithin), సంగీత్ శోభన్ (Sangeeth Shobhan), రామ్ నితిన్ (Ram Nithin) ప్రధాన పాత్రల్లో కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్’. ఈ సినిమాలోనే రెబా మోనికా ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడబోతోందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయమై ఆమెతో టీమ్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. గతేడాది వచ్చిన ‘మ్యాడ్’ (MAD) సినిమాకు ఇది సీక్వెల్ అని తెలిసిందే. రెబా మోనికా జాన్ విషయం చూస్తే.. 30 ఏళ్ల ఈ భామ 2016లో ‘జాకబ్‌ఇంటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది.
‘పైప్పిన్ చువాట్టిలే ప్రణయం’, అనే సినిమా మలయాళంలో చేశాక.. 2018లో ‘జరుగండి’ అనే తమిళ సినిమా చేసింది. ఆ తర్వాతనే ‘బిగిల్’/ ‘విజిల్’ సినిమా చేసింది. అందులో నటనతో మంచి పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘ధనషు రాశి నెయర్‌గలే’, ‘ఫోరెన్సిక్’, ‘రత్నన్ ప్రపంచ’,‘ఎఫ్‌ఐఆర్’, ‘ఇన్నాళె వారే’, ‘బూ’ సినిమాలు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.
అప్పుడే ‘సామజవరగమన’ సినిమా ఛాన్స్ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ‘రజినీ’, ‘అవల్ పెయార్ రజిని’ అనే సినిమాలు చేసింది. ‘సకలకళా వల్లభ’ అనే సినిమాలో ఆమె నటించినా అది వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతూ వస్తోంది. మరిప్పుడు ప్రత్యేక గీతం ఆమె కెరీర్‌కు ఏమైనా బూస్టింగ్ ఇస్తుందేమో చూడాలి.