2019 చివర్లో వచ్చిన ‘మత్తు వదలరా’ (Mathu Vadalara) ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై డీసెంట్ హిట్ అనిపించుకుంది. కీరవాణి (M. M. Keeravani) పెద్ద కొడుకు సింహా కోడూరికి (Sri Simha) హీరోగా మంచి బ్రేక్ ఇచ్చింది ఆ సినిమా. కమెడియన్ సత్య (Satya) కూడా ఈ సినిమాతో లైమ్ లైట్లోకి వచ్చాడు. దర్శకుడు రితేష్ రానాకి (Ritesh Rana) కూడా మంచి పేరు వచ్చింది. ఇక దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ గా ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) వచ్చింది.
Mathu Vadalara 2 Collections:
సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే హిట్ టాక్ ను సంపాదించుకుని బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. దీంతో ఓపెనింగ్స్ చాలా బాగా వచ్చాయి. దీంతో 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించింది ఈ చిత్రం. మరి ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2) చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.4 కోట్లు. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా …. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.15.24 కోట్ల షేర్ ను రాబట్టి రూ.11.24 కోట్ల లాభాలు అందించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ‘మైత్రి’ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసుకున్న ఈ సినిమా ప్రతి బయ్యర్ కి లాభాలు అందించింది.