శ్రీజ కూతురు 15 వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో సందడి చేసిన నిహారిక!

  • July 8, 2023 / 12:36 PM IST

శ్రీజ కొణిదెల.. పరిచయం అవసరం లేని పేరు.మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురిగా.. నటుడు కళ్యాణ్ దేవ్ భార్యగా ఈమె బాగా ఫేమస్. అంతేకాదు సోషల్ మీడియాలో కూడా శ్రీజ చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన పిల్లల ఫోటోలను, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోటోలను, అనుభవాలను ఈమె షేర్ చేస్తూ ఉంటుంది. తన ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా టూర్లకు కూడా వెళ్లొస్తుంటుంది. అలాగే ఆయా వెకేషన్లకి సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

ఇన్స్టాగ్రామ్లో ఈమెకు 4 లక్షలకు పైగా ఫాలోవర్స్ సంఖ్య ఉంది. జూలై 5న శ్రీజ పెద్ద కూతురు నివృతి 15 వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. సోషల్ మీడియాలో ఆరోజున మెగా ఫ్యామిలీతో పాటు ఆమె ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నివృతి కి బర్త్ డే విషెస్ ను చెప్పారు. అలాగే ఆరోజు సాయంత్రం ఇంట్లో గ్రాండ్ పార్టీని హోస్ట్ చేసింది శ్రీజ. ఈ సందర్భంగా నిహారిక కూడా హాజరై సందడి చేసింది.

ఆ వేడుకకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నిహారిక ఈ మధ్యనే తన భర్తతో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. చాలా రోజులుగా ఈ విషయం పై ప్రచారం జరుగుతున్నా.. ఈ మధ్యనే ఈ దంపతులు అధికారికంగా ప్రకటించడం జరిగింది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి నివృతి బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

 

 

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus