Navishka: తండ్రి వద్దే నవిష్క 5 వ పుట్టినరోజు వేడుకలు!

మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ గురించి అందరికీ ఎంతో సుపరిచితుడమే ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న తన వ్యక్తిగత విషయాల ద్వారా పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచారు. ఇక ఇంట్లో వారికి తెలియకుండా మొదటి వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చి తన భర్తతో విడిపోయినటువంటి ఈమెకు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తితో చిరంజీవి ఘనంగా రెండవ వివాహం చేశారు. అయితే ఈ దంపతులకు మరొక కుమార్తె జన్మించిన తర్వాత అభిప్రాయ బేధాలు రావడంతో విడిపోయారు.

ఈ విధంగా వీరిద్దరు విడాకులు తీసుకున్నప్పటికీ తన కుమార్తె శ్రీజ వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు మాత్రమే తన తండ్రి వద్దకు వెళుతూ ఉంటారు. ఇలా తన కూతురు తన వద్దకు వచ్చిన సమయంలో కళ్యాణ్ దేవతలతో కలిసి ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్టులు చేస్తూ ఉంటారు. అయితే గత కొద్దిరోజుల క్రితం కళ్యాణ్ దేవ్ సోదరి సీమంతపు వేడుకలలో భాగంగా నవిష్క అక్కడే ఉన్న సంగతి మనకు తెలిసిందే.

డిసెంబర్ 25వ తేదీ ఈమె పుట్టినరోజు కావడంతో తన తండ్రి వద్దే తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె అయిదవ పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి. హ్యాపీ క్రిస్మస్ అంటూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా ఈరోజే తన కుమార్తె అయిదవ ఏట పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని తెలిపారు.

ఇలా తన కుమార్తెకు (Navishka) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈయన తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించిన వీడియోని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది మీరే ఈ ప్రపంచంలో ఎంతో ఉత్తమమైన తండ్రి అంటూ కామెంట్లు చేస్తూ చిన్నారి నవిష్కకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!

డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus