చిన్న వయసులోనే తెలుగు సినిమా ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న నటి శ్రీలీల (Sreeleela), తాజాగా తన మానవీయతను మరోసారి చూపిస్తూ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పటికే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకుని తల్లిగా చూసుకుంటున్న శ్రీలీల, తాజాగా మూడో పాపను కూడా తన కుటుంబంలోకి తీసుకున్నట్టు ప్రకటించింది. ఓ చిన్నారిని ముద్దాడుతున్న ఫోటోను షేర్ చేస్తూ “ఇంటికి మరో పాప వచ్చింది” అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ఆమె చేసిన ఈ మంచి పనికి నెటిజన్లు కూడా అభినందనలు వెల్లువెత్తిస్తున్నారు.
నటిగా ఎంత బిజీగా ఉన్నా, సమయం దొరికినప్పుడల్లా తన దత్తత పిల్లలతో కలిసి సమయం గడిపే శ్రీలీల, మానవతా విలువలు ఎంత గొప్పవో నిరూపిస్తోంది. ఒకవైపు స్టార్ డమ్, మరోవైపు సేవా దృక్పథం అన్నీ సమపాళ్లలో బ్యాలెన్స్ చేయడం చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యమవుతుంది. సినీ పరిశ్రమలో శ్రీలీల మంచి మనసుకు ప్రత్యేకమైన గుర్తింపు దక్కుతోంది.
ప్రత్యేకించి సెలబ్రిటీలు తమకు లభించిన స్టార్డమ్‌ను తమ కోసం మాత్రమే వినియోగించుకునే రోజుల్లో, శ్రీలీల దీనికి విరుద్ధంగా తన పేరు ఉపయోగించి మంచి పనులు చేస్తుండడం మెచ్చికొదగిన విషయం. ఇటీవల పుష్ప 2 (Pushpa 2) సినిమాలో స్పెషల్ సాంగ్ తో పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ దక్కించుకున్న శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌లోనూ అవకాశాలు అందుకుంటోంది.
నటనతో పాటు, వ్యక్తిత్వం ద్వారా కూడా తన ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. త్వరలోనే తెలుగు, తమిళం, హిందీ భాషల్లో పలు కొత్త సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్న శ్రీలీల, ఒక బిజీ షెడ్యూల్ మధ్యలో కూడా తన కుటుంబానికి, పిల్లలకు సమయం కేటాయించడం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన విషయం.