Sreeleela: బాలయ్య మనస్సు అలాంటిది.. శ్రీలీల చెప్పిన విషయాలు ఇవే!

భగవంత్ కేసర్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిన్న గ్రాండ్ గా జరిగింది. అఖండ, వీరసింహారెడ్డి విజయాలతో జోరుమీదున్న బాలయ్య భగవంత్ కేసరి సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయనున్నారు. భగవంత్ కేసరి ట్రైలర్ లో బాలయ్య తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఈ సినిమా కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. ఈ ఈవెంట్ లో శ్రీలీల మాట్లాడుతూ భగవంత్ కేసరి సినిమాలో నేను వరంగల్ పిల్లగా నటించానని తెలిపారు.

ఈ సినిమాలో నేను విజ్జిపాపగా కనిపిస్తానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో సోల్ కనెక్ట్ క్యారెక్టర్ ను అనిల్ నాకు ఇచ్చారని ఈమె పేర్కొన్నారు. అనిల్ రావిపూడికి ధన్యవాదాలు అని శ్రీలీల కామెంట్లు చేశారు. నేను చాలా సినిమాలలో నటిస్తున్నానని కానీ భగవంత్ కేసరి సినిమా మాత్రమే నాకు కనెక్ట్ అయిందని ఆమె కామెంట్లు చేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ నేను నేను విజ్జీ పాప రోల్ లా మారిపోయానని శ్రీలీల వెల్లడించారు.

బాలయ్యతో కలిసి పని చేయడం చాలా అద్భుతంగా అనిపించిందని శ్రీలీల పేర్కొన్నారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చేసే సమయంలో కట్ చెప్పినా కూడా అదే మూడ్ లో ఉండేదానినని శ్రీలీల కామెంట్లు చేశారు. ఆ మూడ్ నుంచి వెంటనే బయటకు రాలేకపోయానని శ్రీలీల అన్నారు. ఆ సమయంలో బాలయ్య నవ్వించి నార్మల్ మూడ్ కు తీసుకొచ్చేవారని శ్రీలీల చెప్పుకొచ్చారు. అలాగే బాలయ్య నాకు సపోర్ట్ చేశారని శ్రీలీల కామెంట్లు చేశారు.

నా లైఫ్ లో లేని అనుభవాలను ఈ సినిమా ద్వారా అందించారని (Sreeleela) శ్రీలీల అన్నారు. బాలయ్యది చాలా గొప్ప మనస్సు అని శ్రీలీల కామెంట్లు చేశారు. శ్రీలీల వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. భగవంత్ కేసరి సినిమాతో శ్రీలీల ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus