టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా గడుపుతోంది. ఈ మధ్యనే ‘రాబిన్ హుడ్’ తో (Robinhood) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ అతి త్వరలో ‘మాస్ జాతర’ తో (Mass Jathara) కూడా అలరించడానికి రెడీ అవుతుంది. శ్రీలీల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆమె డాన్సులు ఇష్టపడే వారి సంఖ్య కూడా ఎక్కువే. ఇదిలా ఉండగా.. తాజాగా పబ్లిక్ ప్లేస్లో శ్రీలీలకి చేదు అనుభవం ఎదురైంది.
అవును.. అసలు మేటర్లోకి వెళ్తే.. ప్రస్తుతం శ్రీలీల బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ (Kartik Aaryan) హీరోగా తెరకెక్కుతున్న ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతుంది. అనురాగ్ బసు ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాతో శ్రీలీల బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతుంది. ఈ సినిమా షూటింగ్లో భాగంగా ఇటీవల డార్జిలింగ్ కి వెళ్ళింది శ్రీలీల. షూటింగ్ ముగించుకుని వస్తున్న టైంలో పబ్లిక్.. మూవీ టీంని చుట్టుముట్టారు. ఈ క్రమంలో హీరో వెనుక నుండి నడుచుకుంటూ వస్తున్న శ్రీలీలని కొంతమంది ఆకతాయి మూక లాగేసి..
ఆమె ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేసే ప్రయత్నం చేశారు. అయితే ఎలాగోలా బయటపడింది శ్రీలీల. సెలబ్రిటీలు పబ్లిక్ ప్లేసుల్లో కనిపిస్తే ఫోటోలు అడిగి తీసుకోవడానికి వెళ్లిన అమాయకపు ప్రజలని బౌన్సర్లు చితక్కొడుతూ ఉంటారు. మరి ఇలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :
Evadra aa laagesadu #SreeLeela pic.twitter.com/fd8citrIhz
— Radoo (@Chandan_radoo) April 6, 2025