Sreeleela: ఆ కారణంతోనే సినిమాలకు దూరం కానున్న శ్రీ లీల.. షాక్ లో ఫాన్స్!

పెళ్లి సందడి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమయ్యారు యంగ్ బ్యూటీ శ్రీ లీల. ఈమె ఈ సినిమా ద్వారా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను సంపాదించుకున్నారు. ఇక శ్రీ లీల తన తదుపరి చిత్రం ధమాకా సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు.ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుంచి మొదలుకొని యంగ్ హీరోల వరకు ఈమె ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు. ప్రస్తుతం శ్రీ లీల సుమారు పది సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఏమాత్రం తీరిక లేనటువంటి (Sreeleela) శ్రీ లీల సినిమాల విషయంలో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఈమె ఈ ఏడాదిలో రెండు నెలలపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఏడాది నవంబర్ డిసెంబర్ ఈ రెండు నెలల పాటు ఇండస్ట్రీకి శ్రీ లీల దూరం కాబోతున్నారని తెలుస్తోంది. ఇలా వరుస ప్రాజెక్టులకు కమిట్ అయినటువంటి శ్రీ లీల ఉన్నఫలంగా రెండు నెలలపాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడానికి కారణం ఏంటి అన్న ఆలోచనలో అభిమానులు పడ్డారు.

అయితే ఈమె ఇలా రెండు సంవత్సరాలు పాటు ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వడానికి కారణం మరేమీ లేదు ఈమె ప్రస్తుతం ఎంబిబిఎస్ చదువుతున్న సంగతి మనకు తెలిసిందే.ప్రస్తుతం ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి శ్రీలీలకు డిసెంబర్ నెలలో పరీక్షలు ఉన్న నేపథ్యంలోనే ప్రిపరేషన్ కోసం నవంబర్ డిసెంబర్ నెలలో ఇండస్ట్రీకి బ్రేక్ ఇవ్వబోతున్నారని తెలుస్తోంది.

ఇలాంటి డిసెంబర్లో పరీక్షలు పూర్తి అయిన తర్వాత ఈమె తిరిగి యధావిధిగా తన సినిమాల షూటింగ్ పనులలో బిజీ కాబోతున్నారు. ఇక శ్రీ లీల ప్రస్తుతం మహేష్ బాబు, బాలయ్య ,పవన్ కళ్యాణ్ ,నితిన్, రామ్, వైష్ణవ్ వంటి హీరోలందరి సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఇక వచ్చే నెల నుంచి ప్రతినెల ఈమె నటించిన సినిమాలు ఒక్కొక్కటి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాయి.

2023 టాప్- 10 గ్రాసర్స్.. ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేసిందంటే?

‘భోళా శంకర్’ తో పాటు కోల్‌కతా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన 10 సినిమాల రిజల్ట్స్.!

‘వాల్తేరు..’ టు ‘జైలర్’.. ఈ ఏడాది ఫస్ట్ వీక్ ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus