Sreeleela: పోలీస్ కంప్లైంట్ ఇచ్చేందుకు రెడీ అయిన శ్రీలీల!

టాలీవుడ్ క్రష్ శ్రీలీల.. ఆ స్టార్ హీరో నంబర్ ని బ్లాక్ చేసిందా.. అంటే అవునని అంటోని కన్నడ మీడియా. వాస్తవానికి కన్నడ అమ్మాయి అయినా శ్రీలీల తెలుగు ఇండస్ట్రీలో ఎంత టాప్ రేంజ్ హీరోయిన్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కెరీర్ తొలినాళ్లతో మాతృభాష కన్నడంలో సినిమాలు చేసి తర్వాత పాపులారిటీ రావడంతో తెలుగులో అవకాశాలు దక్కించుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన.. పెళ్లి సందడి సినిమాతో సక్సెస్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది.

తర్వాత రవితేజతో ధమాకా సినిమా సూపర్ హిట్ కావడంతో లక్కీ హీరోయిన్‎గా మారిపోయింది. తను సినిమా చేస్తే పక్కా హిట్ అని.. ముద్ర పడిపోయింది. ప్రజెంట్ సీనియర్ హీరో దగ్గరనుంచి, జూనియర్ల వరకు శ్రీలీలే ఫస్ట్ ఛాయిస్. శ్రీలీల చేతిలో దాదాపు డజన్ సినిమాలు ఉన్నాయి. పది సినిమాలు సెట్స్ పైనే ఉన్నాయి. గత కొద్ది రోజుల నుంచి శ్రీలీలకు కన్నడ ఇండస్ట్రీలో ఉండే ఓ స్టార్ హీరో అన్ వాంటెడ్.. మెసేజెస్ ఎక్కువగా చేస్తున్నారు.

పలు వల్గర్ వీడియో పంపిస్తున్నాడట. ఓ విధంగా ఆమెను మెంటల్లీ హెరాస్ చేస్తున్నారని.. ఆ కారణంగా శ్రీలీల ఆ స్టార్ హీరో నంబర్ బ్లాక్ చేసింది.. అంటూ తెలుస్తుంది. ఆ కన్నడ స్టార్ హీరోకి మొదటి నుంచి శ్రీలీల అంటే ఓ స్పెషల్ ఇంట్రెస్ట్ అట.. కానీ ఆమె అలాంటివి పెద్దగా పట్టించుకోదట. అందుకే శ్రీలీల ఆయనను దూరం పెడుతూ వచ్చిందట. కానీ తెలుగు ఇండస్ట్రీలో పాపులారిటీ దక్కించుకుంటున్న శ్రీలీలను ఆయన ఎలాగైనా తన సినిమాలో పెట్టుకోవాలని చూస్తున్నారట.

కానీ శ్రీలీలా అందుకు ఒప్పుకోకపోవడంతో ఇలా వేరువేరు నంబర్ల నుంచి ఆయన అసభ్యకరంగా మెసేజ్‎లు చేస్తుండడంతో ఆమె ఆయన నంబర్స్‎ని బ్లాక్ చేస్తూ వస్తుందట. ఇంకోసారి ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ కూడా ఇస్తానని వార్నింగ్ సైతం ఇచ్చిందట. ప్రస్తుతం ఇదే వార్త కన్నడ ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతోంది.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus