Sreeleela: శ్రీలీలను బీట్‌ చేయాలంటే అటువైపు హీరోయిన్‌ సరిపోదు.. మరో శ్రీలీలే కావాలి!

అదేదో సినిమాలో చెప్పినట్లు… ‘నన్ను ఢీకొట్టడాని అవతలి వైపు ఎవరో ఒకరు వస్తే సరిపోదు… తనే ఉండాలి’ అని అంటాడు. ఆ డైలాగ్ సినిమాలో ఆ పాత్రధారికి కరెక్ట్‌గా నప్పింది అని చెప్పొచ్చు. అయితే ఆ డైలాగ్‌ను తెలుగు హీరోయిన్లలో ఒకరికి, అందులోనూ లేటెస్ట్‌ నాయిక ఒకరికి ఇవ్వాలి అనుకుంటే.. కచ్చితంగా శ్రీలీలకు ఇవ్వొచ్చు. టాలీవుడ్‌లో ఇప్పుడు ఆమె కెరీర్‌ సాగుతున్న విధానం చూస్తుంటే… శ్రీలీలను బీట్‌ చేయాలంటే అటువైపు హీరోయిన్‌ సరిపోదు.. మరో శ్రీలీలే కావాలి అని అనొచ్చు.

ప్రస్తుతం టాలీవుడ్‌లో కొత్త సినిమా ఏదైనా పట్టాలెక్కుతుంది, అందులోనూ స్టార్‌ హీరో సినిమా అంటే ‘హీరోయిన్‌ శ్రీలీలేనా?’ అని అడుగుతున్నారు. ఎందుకంటే వరుసగా ఆమె చేస్తున్న సినిమాలు అలా ఉన్నాయి మరి. మొత్తంలో సెట్స్‌ మీద ఆమె సినిమాలు తొమ్మిది ఉన్నాయి. మరో మూడు, నాలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. దీంతో ఇప్పట్లో శ్రీలీలను బీట్‌ చేసేవాళ్లే లేరు అనే టాక్‌ వినిపిస్తోంది. ఆమె తాకిడి అప్పటికే స్టార్‌ హీరోయిన్లు అయినవాళ్లు డౌన్‌ అయిపోయారు.

కొత్తగా స్టార్‌ హీరోయిన్‌ అవుదాం అనుకున్న వాళ్లు వెనుకబడిపోయారు అని చెప్పాలి. ‘పెళ్ళి సందD’ సినిమాతో టాలీవుడ్‌లోకి వచ్చిన శ్రీలీల రెండో చిత్రం ‘ధమాకా’తో బ్లాక్‌బస్టర్‌ అందుకుంది. ఆ తర్వాత ఇక ఆమెను ఆపేవారే లేరు. అలా అని వరుసగా ఆమె నుండి సినిమాలు రిలీజ్‌ అయ్యాయా అంటే లేదనే చెప్పాలి. కానీ సెట్స్‌ మీద ఉన్న సినిమాలు చాలానే ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆమె స్థాయిలో సినిమాలు చేయాలంటే ఆమెనే మళ్లీ కావాలి అనేలా పరిస్థితులు మారాయి.

అలా అని టాలెంట్‌ లేకుండా ఏదో గాలివాటంగా సినిమాలు సంపాదిస్తోందా అంటే అన్ని విషయాల్లోనూ టాప్‌ అనిపించుకుంటోంది. డ్యాన్స్‌, అందం, క్యూట్‌నెస్‌, గ్రేస్‌.. ఇలా అన్నింటా అదిరిపోతోంది. ఈ మధ్య పాటలు కూడా పాడి అదరగొట్టింది. దీంతో ఇప్పటికిప్పుడు మరో శ్రీలీల కావాలి అని టాలీవుడ్‌ అనే పరిస్థితి వచ్చింది. మరి ఎవరా శ్రీలీల (Sreeleela) అనేది చూడాలి.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus