Sreeleela: నా వరకు నా హీరో అతనే..అతనితోనే అన్ని : శ్రీలీల..!

ప్రస్తుతం టాలీవుడ్ లో మంచి క్రేజ్ మరియు డిమాండ్ తో కొనసాగుతున్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు శ్రీలీల. ఈమె డేట్స్ కోసం ఇప్పుడు చిన్నా పెద్ద అని తేడా లేకుండా ప్రతీ హీరో ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈమె ఒక్క రోజు సెలవు పెడితే సినిమా ఇండస్ట్రీ స్ట్రైక్ అయ్యే పరిస్థితి వస్తుంది అంటూ సోషల్ మీడియా లో మీమ్స్ ఒక రేంజ్ లో ట్రెండ్ అవుతున్నాయి.

‘ధమాకా’ చిత్రం ఈమె నుండి విడుదలైన ‘స్కంద’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్ అవ్వగా, రీసెంట్ గా దసరా కానుకగా విడుదలైన ‘భగవంత్ కేసరి’ చిత్రం మాత్రం పెద్ద హిట్ అయ్యింది. దసరా కి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ మరియు సక్సెస్ మీట్స్ లో శ్రీలీల ఫుల్ బిజీ గా ఉంది.

రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో (Sreeleela) శ్రీలీల ని అనేక ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నలు అడిగింది ఒక యాంకర్. అందులో భాగంగా వీరిలో మీరు లిప్ లాక్ మరియు రొమాన్స్ సన్నివేశాలు చెయ్యడానికి ఏ హీరో తో ఇష్టపడుతారు అని అడగగా, దానికి శ్రీలీల సమాధానం చెప్తూ ‘కథ డిమాండ్ ని బట్టి ఉంటుంది అండీ అది. కేవలం ఒక్క హీరో తోనే లిప్ లాక్ సన్నివేశాల్లో నటించాలనే కోరిక నాకేమి లేదు.

నా వరకు నా కాబొయ్యే భర్తే నా హీరో. లిప్ లాక్ అయినా రొమాన్స్ అయినా ఆయనతోనే నేను చెయ్యాలని కోరుకుంటాను’ అంటూ సమాధానం ఇచ్చింది శ్రీలీల. ఇలా ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా సమాధానం చెప్పలేదు. తమన్నా, కాజల్ అగర్వాల్ వంటి హీరోయిన్లు కూడా ఇలాంటి ప్రశ్నలకు పలానా హీరో తో చెయ్యాలని ఉందంటూ బహిరంగంగా చెప్పేవాళ్ళు. కానీ శ్రీలీల ఇచ్చిన ఈ స్మార్ట్ సమాధానం కి యాంకర్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus