Sreeleela: వదిలేసి మంచి పనైంది.. శ్రీలీల కెరీర్‌లో ఇంకాస్త డ్యామేజ్‌ అయ్యేది..

ఏ సినిమా చేయాలి అనే విషయం తెలియడమే కాదు.. ఏ సినిమా చేయకూడదు అనే విషయం కూడా తెలియాలి. మొదటిది సరిగ్గా తెలియకపోయినా.. రెండో విషయం మాత్రం పక్కాగా తెలిసి ఉండాలి. లేదంటే నటులుగా కెరీర్‌ త్వరగా ముగిసిపోతుంది. హీరోల విషయంలోనూ ఇది వర్తించినా.. ఎక్కువగా హీరోయిన్ల విషయంలో వర్తిస్తుంది. ఇలా కాస్త జాగ్రత్త పడినందువల్లే శ్రీలీల  (Sreeleela)  ఓ ఫ్లాప్‌ నుండి బయటపడిందా? ప్రస్తుతం కోలీవుడ్‌ వర్గాల సమాచారం ప్రకారం అయితే.. శ్రీలీల ఓ ఫ్లాప్‌ నుండి అయితే తప్పించుకుంది.

Sreeleela

ఆ సినిమానే ‘ది గోట్‌’ (The Greatest of All Time)  . విజయ్‌  (Thalapathy Vijay) – వెంకట్‌ ప్రభు (Venkat Prabhu)  కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల విడుదలై సరైన ఫలితం అందుకోలేదు. ఆ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్‌ కోసం గతంలో శ్రీలీలను కాంటాక్ట్‌ అయ్యారనే వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఓకే చేయలేదు అని చెప్పారు. ఇప్పుడు ఆ పాటలోనే త్రిష (Trisha) ఆడిపాడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ఉండి ఉంటే ఆమె కెరీర్‌లో మరో ఇబ్బందికర సినిమా వచ్చి ఉండేదే.

ఇప్పటికే వరుస సినిమాలు దారుణమైన ఫలితం అందుకుని కెరీర్‌ను ఇబ్బందుల్లో పెట్టుకున్న శ్రీలీలకు (Sreeleela) ఈ సినిమా మిస్‌ అవ్వడం మంచిదే అని చెప్పొచ్చు. ఫ్లాపులు ఉన్నాయి కాబ‌ట్టి ఐటెమ్ గాళ్‌గా మారిపోయింది అనే కామెంట్లు కూడా ఆమె పడాల్సి వచ్చేది. ఇక ప్రస్తుతం శ్రీలీల సినిమాలు చూస్తే.. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ (Ustaad Bhagat Singh)  చేస్తోంది. దీంతోపాటు రవితేజ 75వ (RT75) సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌.

ఇవి కాకుండా తమళంలో ఓ సినిమా, హిందీలో రెండు సినిమాలు ఓకే చేసింది అని చెబుతున్నారు. అయితే తెలుగు సినిమాల విషయంలోనే ఆమె నటిస్తోంది అనే క్లారిటీ ఉంది. ఇతర భాషల సినిమాల సంగతి తేలడం లేదు. ‘ది గోట్‌’ అనే కాదు.. తెలుగులో కొన్ని సినిమాల్లో ప్రత్యేక గీతాల ఆఫర్లు వచ్చినా శ్రీలీల ఓకే చెప్పలేదు. ఈ లిస్ట్‌లో ‘పుష్ప: ది రూల్‌’  (Pushpa 2), ‘విశ్వంభర’ (Vishwambhara)  లాంటి సినిమాలు కూడా ఉన్నాయి అంటున్నారు.

బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ సినిమాల్లో సౌత్‌ స్టార్లు.. రోహిత్‌ ప్లానిదేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus