Ajay Devgn: బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ సినిమాల్లో సౌత్‌ స్టార్లు.. రోహిత్‌ ప్లానిదేనా?

బాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్‌ ఫ్రాంచైజీల్లో ‘సింగమ్‌’ ఒకటి. తమిళ సినిమానే అక్కడికి తీసుకెళ్లి భారీ విజయం అందుకున్నారు రోహిత్‌ శెట్టి (Rohit Shetty)  – అజయ్‌ దేవగణ్‌(Ajay Devgn)  . ఈ సిరీస్‌లో ఐదో సినిమా ఇప్పుడు రెడీ అవుతోంది. ‘సింగమ్‌ అగైన్‌’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమా గురించి దర్శకుడు రోహిత్‌ శెట్టి ప్రచారం కోసం భారీ ప్రయత్నాలే చేస్తున్నారు. ఈ క్రమంలో దక్షిణాది స్టార్‌ హీరోలను సినిమాలో భాగం చేస్తున్నారు అని అనిపిస్తోంది. కావాలంటే మీరే చూడండి..

Ajay Devgn

‘సింగమ్‌ అగైన్‌’ సినిమా నుండి గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు, లీకులు చూస్తుంటే చాలామంది దక్షిణాది స్టార్‌ హీరోలు భాగమవుతున్నారు అనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్‌ నటిస్తున్నాడు అని వార్తలు రాగా, తాజాగా ఆ సినిమాలో ఒరిజినల్‌ సింగమ్‌ (Singam) .. అదేనండీ సూర్య (Suriya) నటించనున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ‘సింగమ్‌’ (Singham) సిరీస్‌లో ఇప్పటివరకు ‘సింగమ్‌’, ‘సింగమ్‌ రిటర్న్స్‌’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఐదో సినిమాగా ఈ ‘సింగమ్‌ అగైన్‌’ను తెరకెక్కిస్తున్నారు.

ఇందులో ఇప్పుడు సూర్య, ప్రభాస్‌ (Prabhas) ఇద్దరూ పోలీసులుగా కనిపిస్తారు అనే చర్చ జరుగుతోంది. అయితే సూర్య మాత్రమే పోలీసుగా కనిపిస్తాడు అని, ప్రభాస్‌ మరో పవర్‌ ఫుల్‌ పాత్రలోకనిపిస్తాడు అని అంటున్నారు. గతంలో ప్రభాస్ ‘యాక్షన్ జాక్సన్’ అనే సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. ఇక సూర్య రీసెంట్‌గా తన సినిమా ‘ఆకాశమే హద్దురా’ రీమేక్‌ ‘సర్ఫిరా’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు. దీంతో వాళ్లకు కేమియోలు కొత్తేమీ కాదు.

అయితే ‘సింగమ్‌ అగైన్‌’ సినిమాలో నటించారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు మలయాళ పరిశ్రమ నుండి కూడా ఓ స్టార్‌ హీరో నటిస్తారనే ప్రచారమూ నడుస్తోంది. మరోవైపు ‘సింగమ్‌ అగైన్‌’ సినిమాకు సౌత్‌లో భారీ ప్రచారం చేసుకోవడం కోసమే సౌత్‌ స్టార్స్‌ను తీసుకుంటున్నారు అనే చర్చ కూడా నడుస్తోంది. మరి దర్శకుడు రోహిత్‌ శెట్టి మనసులో ఏముందో తెలియాలి?

రామ్‌ చరణ్‌.. మోక్షజ్ఞ పేర్లలో కామన్‌ పాయింట్‌.. ఏంటో తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus