టాలీవుడ్‌లో కుర్ర హీరోల మొదటి ఛాయస్‌గా మారిన శ్రీలీల (Sreeleela) , వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ బిజీగా మారిపోయింది. పెళ్లి సందDతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ, ధమాకా మూవీతో తొలి భారీ హిట్ అందుకుంది. ఆ తర్వాత అవకాశాల వర్షమే కురిసింది. మాస్, క్లాస్ సినిమాలు కలిపి చేస్తూ స్టార్ హీరోల సరసన నిలిచింది. అయితే వరుస సినిమాలతో పాటు, డేట్స్ మేనేజ్‌మెంట్ విషయంలో కొన్ని సమస్యలు తలెత్తుతున్నట్లు టాక్ వస్తోంది.
ఇటీవలె పుష్ప 2లో (Pushpa 2: The Rule) కిస్సిక్ సాంగ్‌తో శ్రీలీల మరోసారి హాట్ టాపిక్ అయింది. అంతకు ముందు వరుస ఫ్లాప్స్ వచ్చినా ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఆమె చేతిలో పెద్ద సినిమాలే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), నితిన్ (Nithiin) రాబిన్ హుడ్ (Robinhood), రవితేజతో (Ravi Teja) మాస్ జాతర (Mass Jathara) సినిమాలు చేస్తున్న ఆమె, కాల్షీట్లు క్లియర్‌గా ప్లాన్ చేసుకోకపోతే సమస్యలు ఎదుర్కొనే అవకాశముందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం శ్రీలీలపై ఒక కొత్త టాక్ వైరల్ అవుతోంది.
అడ్వాన్స్ తీసుకున్న సినిమాలకు సమయానికి కాల్షీట్లు ఇవ్వలేకపోతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాస్ జాతర సినిమా కూడా ఆమె డేట్స్ సమస్యల వల్ల లేట్ అవుతోందని ప్రచారం జరుగుతోంది. ఆమె ఏప్రిల్ నాటికి మాత్రమే షూటింగ్‌కు సిద్ధంగా ఉంటుందని చెప్పడంతో, మరో హీరోయిన్‌ను అన్వేషించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. టాలీవుడ్‌లో క్యాలెండర్ కన్‌ఫ్యూజన్ ఒక స్టార్ హీరోయిన్‌ను గందరగోళంలో పడేసే ప్రమాదం ఎక్కువ. శ్రీలీల క్రేజ్ ఉన్నప్పటికీ, ప్రాజెక్ట్‌లను బ్యాలెన్స్ చేసుకోకపోతే, అవకాశాలు కాస్తా చేజారిపోవచ్చు.
ఒకే సమయంలో పెద్ద సినిమాలు లైన్‌లో పెట్టుకోవడం చాలా మంది హీరోయిన్స్ చేసిన పొరపాటే. ఇప్పటికే కొన్ని సినిమాల విడుదలలు వాయిదా పడటం, డేట్స్ క్లాష్ అవడం, మేకర్స్‌కి సమస్యలు రావడం వంటి విషయాలు ఆమెను ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం శ్రీలీల టాప్ రేస్‌లో ఉన్నారు. కానీ ఈ మేనేజ్‌మెంట్ సమస్యలను త్వరగా క్లియర్ చేసుకోవాలి. లేదంటే, టాలీవుడ్‌లో నిర్మాతలు, దర్శకులు ఆమెతో భవిష్యత్తులో సినిమా చేసేందుకు వెనుకడుగు వేసే ప్రమాదం ఉంది.