Sreeleela: బాలయ్య – అనిల్ రావిపూడి సినిమాలో శ్రీలీల టెంపుల్ సీన్ గురించి టాక్ ఏంటంటే..?

నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అఖండ’, ‘వీర సింహా రెడ్డి’ లతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్స్, కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టి ఫుల్ జోష్‌లో ఉన్నారు.. సినిమాలు, రాజకీయాలు, యాడ్స్ షూటింగులతో బిజీ బిజీగా ఉంటున్న బాలయ్య ఇప్పుడు హ్యాట్రిక్ కోసం రెడీ అవుతున్నారు.. మరోవైపు ‘వీర సింహా రెడ్డి’ ఓటీటీ స్ట్రీమింగ్‌లోనూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు.. బాలయ్య తన 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తున్న సంగతి తెలిసిందే..

షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది – సాహు గారపాటి నిర్మిస్తుండగా.. లేటెస్ట్ టాలీవుడ్ సెన్సేషన్, మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ శ్రీలీల బాలయ్య కూతురిగా.. కాజల్ అగర్వాల్ ఆయనకు తొలిసారి జోడీగా నటిస్తున్నారు.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తున్నాడు.. 2022 డిసెంబర్‌లో షూటింగ్ స్టార్ట్ అయింది.. తారక రత్న అకాల మరణం కారణంగా కొద్ది రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న సెకండ్ షెడ్యూల్ రీసెంట్‌గా ప్రారంభమైంది.. బాలయ్య నుండి ఫ్యాన్స్, ఆడియన్స్ ఏం ఆశిస్తారో ఆ అంశాలతో పాటు..

ఆయన ఇమేజ్‌కి తగ్గ కథ, కథనాలతో.. నటసింహాన్ని నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అవతార్‌లో చూపిస్తూనే.. తన మార్క్ కామెడీ కూడా ఉంటుందని.. బాలయ్య కామెడీ చేయకపోయినా కామెడీ అనేది కనిపిస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు.. 30+ వయసులో జైలుకెళ్లి, 50 సంవత్సరాలు పైబడిన తర్వాత విడుదలయ్యే క్యారెక్టర్ అని వార్తలు వస్తున్నాయి.. ఇక శ్రీలీల కూతురి క్యారెక్టర్ చేస్తుందనగానే అంచనాలు పెరిగిపోయాయి.. చేసింది రెండు సినిమాలే అయినా తన అందంతో పాటు అభినయం, అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడమే కాక ఇండస్ట్రీలో బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయింది తను..

ఇక NBK 108 ఫిలిం వర్గాల్లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.. సెకండ్ షెడ్యూల్‌లో బాలయ్య – శ్రీలీల మీద టెంపుల్‌లో ఓ సీన్ షూట్ చేశారట.. అనిల్ రావిపూడి చెప్పినట్టే బాలయ్య బాబు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ క్యారెక్టర్‌లో కనిపించగా.. శ్రీలీల పర్ఫార్మెన్స్ అదరగొట్టేసిందని.. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం గుర్తుండిపోయే హీరోయిన్లలో శ్రీలీల పేరు చేరిపోవడం ఖాయం అంటూ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది..

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus