“పెళ్లి సందD” సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయిన శ్రీలీల (Sreeleela) , ఆ సినిమా ఫలితం ఎలా ఉన్నా, తన అందంతో ప్రేక్షకుల మన్ననలు పొందింది. తర్వాత రవితేజ సరసన “ధమాకా”లో (Dhamaka) నటించి సూపర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ, అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ యంగ్ హీరోల సరసన సినిమాలు చేస్తూ, తనకు ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటోంది. ఇటీవల మహేష్ బాబు (Mahesh Babu) నటించిన “గుంటూరు కారం”లో (Guntur Kaaram) కనిపించిన శ్రీలీలకు, సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోయినా, తన నటనకు మంచి ప్రశంసలు అందాయి.
ఇప్పుడు ఆమెకు మరిన్ని క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా శ్రీలీల అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) హీరోగా కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ త్వరలోనే ప్రారంభమవుతుందని సమాచారం. ఇదిలా ఉంటే, మరోవైపు అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా రూపొందబోయే కొత్త ప్రాజెక్ట్‌లో కూడా శ్రీలీలకు (Sreeleela) హీరోయిన్‌గా అవకాశం వచ్చినట్లు టాక్ వినిపిస్తోంది.
మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాలో శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. ఒకేసారి ఇద్దరు అక్కినేని బ్రదర్స్‌తో జతకట్టే అవకాశం దక్కించుకున్న తొలి హీరోయిన్‌గా శ్రీలీల నిలిచే అవకాశం ఉంది. కేవలం హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, ఇటీవల “పుష్ప 2″లో (Pushpa 2: The Rule) “కిస్సిక్” ఐటెం సాంగ్‌లో తన డాన్స్‌తో ప్రేక్షకులను మెప్పించింది.
అల్లు అర్జున్ (Allu Arjun) సరసన వేసిన స్టెప్పులు పెద్ద ఎత్తున పాపులర్ అయ్యాయి. ఐటెం సాంగ్స్‌లో నటించనని గతంలో చెప్పిన శ్రీలీల, ఈ సాంగ్ ద్వారా తనలోని కొత్త యాంగిల్‌ను చూపించి, తన స్థాయిని మరింత పెంచుకుంది. ఇప్పుడు శ్రీలీల చేతిలో నితిన్‌తో (Nithiin) “రాబిన్ హుడ్,(Robinhood) ” నాగ చైతన్య, అఖిల్ ప్రాజెక్ట్స్‌తో పాటు, పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి. ఈ సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.