Sreemukhi: నెటిజన్లుకు షాకింగ్ సమాధానం చెప్పిన శ్రీముఖి..!

తెలుగులో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని శ్రీముఖి. తన మాట తీరుతో బుల్లితెర రాములమ్మగా పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. టాప్‌ యాంకర్స్‌లో ఒకరిగా నిలిచింది. ఇటు సోషల్ మీడియాలో లేటెస్ట్ పిక్స్‌ భారీ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంటోంది. బుల్లితెరపై మెరుపులు మెరిస్తున్న శ్రీముఖి.. వెండితెరపై కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. టీవీ షోలు, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం రాములమ్మ హవా తగ్గదు.శ్రీముఖి ఏ ఫొటో షూట్ చేసిన క్షణాల్లో వైరల్ అవుతాయి.

నెటిజన్ల కామెంట్ల వర్షం కురిపిస్తూ పొగడ్లలతో ముంచెస్తున్నారు. ఇక ఈ మధ్య ఎక్కడ చూసినా అమ్మడి పెళ్లి గురించే ప్రస్తావన నడుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ మూడు పదులు ఎప్పుడో దాటేసింది ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ తన పెళ్లి గురించి బ్రేకప్ గురించి ఒక క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఇన్స్టాగ్రామ్ లో అభిమానులతో శ్రీముఖి ముచ్చటించింది.

అందులో భాగంగా ఒక ఫాలోవర్ “శ్రీముఖి గారు మీరు ఎప్పుడైనా ప్రేమలో విఫలమయ్యారా..?” అని అడగగా దానికి శ్రీముఖి నిర్మొహమాటంగా ” ఓ బొచ్చెడు సార్లు” అంటూ చెప్పకు వచ్చేసింది. అంతేకాకుండా పెళ్లి తర్వాత మీరు యాంకరింగ్ మానేస్తారా అన్న ప్రశ్నకు పెళ్లి తర్వాత కూడా నేను ఈ యాంకరింగ్ మానను.. కచ్చితంగా పెళ్లి అయితే చేసుకుంటానని మాటిస్తున్నాను” అని చెప్పుకొచ్చింది.

అయితే గత కొన్ని రోజులుగా శ్రీముఖి (Sreemukhi) ఒక బిజినెస్ మేన్ తో ప్రేమలో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. శ్రీముఖి అంకుల్స్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా ఓటీటీలో రీలీజ్ అయి మంచి విజయం సాధించింది. అలాగే ఇటీవల రీలీజ్ అయిన చిరంజీవి సినిమా భోళా శంకర్ సినిమా కీలక పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పంచింది.

యానిమల్ సినిమా రివ్యూ & రేటింగ్!

దూత వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus