Sreemukhi: పెళ్ళి పై, అలాగే తనకు కాబోయే వరుడు పై శ్రీముఖి చెప్పిన ఆసక్తికర విషయాలు..!

స్టార్ యాంకర్ శ్రీముఖి బుల్లితెర చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తూ ఉండేది కానీ ఈ మధ్యన తగ్గించింది. ఈటీవీలో ఈమె హోస్ట్ చేస్తున్న ‘జాతి రత్నాలు’ షోకి మంచి ఆధరణ లభిస్తుంది.ఇక ఆదివారం నాడు శ్రీరామనవమి కావడంతో యాంకర్ సుమ హోస్ట్ చేస్తున్న ‘క్యాష్’ షోకి వెళ్ళి అక్కడ రచ్చ చేసింది. తాను మాత్రమే కాకుండా ఆ షోకి తన ‘జాతి రత్నాలు’ టీం మొత్తాన్ని తీసుకెళ్ళింది.

ఈ షోలో భాగంగా తన పర్సనల్ లైఫ్ గురించి ముఖ్యంగా పెళ్లి గురించి ఈమె స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి వచ్చి 10 ఏళ్ళు కావస్తోన్నప్పటికీ .. ఎంతోమంది అందమైన హీరోలతో, కో యాక్టర్‌లతో వర్క్ చేసినప్పటికీ.. ఎవ్వరికీ నా మనసు ఇవ్వలేదు. ఇప్పటివరకు నేను పెళ్లి చేసుకోకుండా.. నా మెడలో మూడు ముళ్లు వేయించుకోకుండా ఉండటానికి ఓ వ్యక్తి కారణం. అతను మరెవరో కాదు ..’ అంటూ శ్రీముఖి చెప్పబోతున్న పేరుని మ్యూట్ చేసి ప్రోమోని వదిలారు.

అందులో లవ్ సింబల్స్‌ని కూడా జతచేయడంతో శ్రీముఖికి కాబోయే భర్తని పరిచయం చేస్తుందేమో అనే క్యూరియాసిటీని కల్పిస్తూ ప్రోమోని వదిలారు. నిజంగానే శ్రీముఖి తన కాబోయే భర్తని పరిచయం చేస్తుందా లేక.. ఇది ప్రమోషన్ కోసమేనా అన్నది ఏప్రిల్ 9న తెలుస్తుంది.’బిగ్ బాస్3′ లో శ్రీముఖి ఓ పాపులర్ హీరోని ప్రేమించినట్టు తెలిపింది. అతను తర్వాత నొ చెప్పడంతో….డిప్రెషన్‌లో కు వెళ్ళిపోయినట్టు కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఇదొక డార్క్ సీక్రెట్ అని కేవలం వరుణ్ సందేశ్ కు మాత్రమే ఆ విషయాన్ని తెలిపింది శ్రీముఖి.

ఆ తర్వాత ఆ విషయాన్ని అంతా మర్చిపోయారు. ఇక శ్రీముఖికి హ్యాండ్ ఇచ్చిన బాయ్ ఫ్రెండ్ కూడా ‘బిగ్ బాస్’ లో ఓ కంటెస్టెంట్ గా పాల్గొన్నట్టు ఇన్సైడ్ టాక్. అయితే అతని పేరు మాత్రం బయటకి రాలేదు. అతను తెలుగు బిగ్ బాస్ లో పాల్గొన్నాడా లేక వేరే భాషలోని బిగ్ బాస్ లో పాల్గొన్నాడా అన్న విషయం పై మాత్రం క్లారిటీ రాలేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ నుండీ అదిరిపోయే 20 డైలాగులు..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
‘ప్రతిఘటన’ తో గోపీచంద్ తండ్రి టి.కృష్ణ దర్శకత్వం వహించిన సినిమాల లిస్ట్..!
5 ఏళ్ళ కెరీర్ లో రష్మిక మందన మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus