Bigg Boss 5 Telugu: జెస్సీ కోసం శ్రీరామ్ ఎందుకు త్యాగం చేశాడు..?

బిగ్ బాస్ హౌస్ లో 8వ వారం నామినేషన్స్ లో హౌస్ మేట్స్ వారి ప్రత్యేకమైన బాండింగ్ ని చూపించారు. ఎప్పుడూ ఒకరినొకరు నిందించుకుంటూ నామినేట్ చేస్కునే హౌస్ మేట్స్, ఈసారి ఒకరికోసం మరొకరు త్యాగం చేస్తూ సెల్ఫ్ నామినేషన్ కి సైతం సిద్ధపడ్డారు. ఇక్కడే ఫస్ట్ లోబోకి ఇంకా విశ్వకి శ్రీరామ్ అండ్ రవిల ఉత్తరాలు వచ్చాయి. రవికి ఆల్రెడీ తన భార్య రాసిన ఉత్తరం, కూతురు పంపిన బొమ్మ ఉన్నాయి కాబట్టి, శ్రీరామ్ కి ఏమీ లేవు కాబట్టి రవి త్యాగం చేస్తాను అంటూ త్యాగం చేశాడు.

ఇక్కడే శ్రీరామ్ తనకి వచ్చిన లెటర్ ని చదువుతూ బాగా ఎమోషనల్ అయ్యాడు. ఆతర్వాత షణ్ముక్ కూడా తన లెటర్ ని కాదని కాజల్ కి శాక్రిఫైజ్ చేశాడు. మా అమ్మే నా ఇన్సిపిరేషన్ అంటూ చెప్పాడు. బాగా ఎమోషనల్ అయ్యాడు. ఇలా హౌస్ మేట్స్ ఎమోషనల్స్ తో ఆడుకున్న బిగ్ బాస్ అక్కడితో ఆగలేదు. ఇంకాస్త ముందుకెళ్లి కెప్టెన్ సన్నీకి ప్రత్యేకమైన పవర్ ఇచ్చాడు. సన్నీకి జెస్సీని నేరుగా నామినేట్ చేయచ్చని, ఒకవేళ జెస్సీకి వచ్చిన లెటర్ చదవాలి అంటే వేరే హౌస్ మేట్స్ సేఫ్ జోన్ లో ఉన్నవారు ఎవరైనా నామినేషన్స్ లోకి వచ్చి జెస్సీని కాపాడచ్చని ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో శ్రీరామ్ చంద్ర నా లెటర్ చదివేశాను కదా.. నేను చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు.

జెస్సీ దీనికి ముందు నిరాకరించినా ఆ తర్వాత ఒప్పుకున్నాడు. శ్రీరామ్ చంద్ర తన లెటర్ ని శాక్రిఫైజ్ చేసి షణ్ముక్, సిరి, జెస్సీ టీమ్ కి దగ్గరయ్యాడు. దీంతో సిరి ఇంకా షణ్ముక్ ఇద్దరూ కూడా శ్రీరామ్ ని ఎప్రిషియేట్ చేశారు. అయితే, ఇక్కడే రవి వచ్చి పాత ఇష్యూని మళ్లీ తీస్కునివచ్చాడు. మీ ముగ్గురు కూడా శ్రీరామ్ కి హగ్ ఇచ్చేయండి, అది కూడా క్లియర్ అయిపోతుంది కదా అంటూ చెప్పాడు రవి. మద్యలో ఆ ఇష్యూని తీస్కుని రావద్దని చెప్పింది సిరి. జెస్సీ కోసమే శ్రీరామ్ చేస్తున్నానని క్లియర్ గా చెప్పాడు. నామినేట్ అయినా పర్లేదు అంటూ లెటర్ తీస్కోమని జెస్సీకి మనస్ఫూర్తిగా చెప్పాడు. దీంతో షణ్ముక్ కి శ్రీరామ్ బాగా నచ్చాడు. ఇద్దరూ హగ్ చేస్కున్నారు. మరి ఇక్కడితో వీరిద్దరి మద్యలో ఫ్రెండ్షిప్ కుదిరినట్లేనా లేదా అనేది మరికొన్ని రోజులు ఆగితేనే కానీ తెలీదు. అదీ మేటర్.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus