Niharika: నిహారిక విడాకులు.. కర్మ ఫలితం అంటూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి!

  • July 7, 2023 / 06:57 PM IST

మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకుపోతున్నట్టు గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి అయితే ఈ వార్తలు నిజమేనంటూ ఈమె తమ విడాకుల విషయాన్ని అధికారకంగా తెలియజేశారు. ఇలా నిహారిక విడాకుల గురించి క్లారిటీ ఇవ్వడంతో వీరి గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇకపోతే తాజాగా నిహారిక విడాకుల విషయంపై శ్రీ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా నిహారిక విడాకుల విషయం గురించి మాట్లాడుతూ నాగబాబును టార్గెట్ చేశారు.

ఒకప్పుడు నాగబాబు శ్రీరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆమెపై ఎన్నో విమర్శలు చేసిన విషయాలని గుర్తు చేశారు. ఒకప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ నన్ను తిట్టావు. ఎంతోమంది ఆడవారి పట్ల అగౌరవంగా మాట్లాడవు. నువ్వు ఇలా మాట్లాడిన ఈ శ్రీరెడ్డి ఏమి చేయలేక పోయింది కానీ కర్మ ఫలితం అనేది ఒకటి ఉంటుంది అది ఇప్పుడు నీకు బాగా తిరిగి వచ్చింది అంటూ ఫైర్ అయ్యారు.

ఇక రాజకీయాలలో కూడా నాగబాబు చురుగ్గా ఉంటూ వైసీపీ మహిళా కార్యకర్తలపై ఈయన విమర్శలు చేసిన విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఇంట్లో కూతురిని సరిగా పెంచలేనీ నువ్వు అలాంటిది రాజకీయాలలోకి వచ్చి ప్రజలకు ఏం చేస్తావు అంటూ నాగబాబుకు సూటి ప్రశ్న వేశారు. రాజకీయాలలో నీతులు చెప్పే నాగబాబు కూతురిని మాత్రం గాలికి వదిలేసారు అంటూ ఈమె మండిపడ్డారు.

ఇక నిహారిక గురించి మాట్లాడుతూ నిహారిక (Niharika) తనకే పెళ్లయినట్టు పెళ్లి సమయంలో ఓ రేంజ్ లో బిల్డప్ కొట్టింది. ఇప్పుడు విడాకులు అనేసరికి ప్రైవసీ కావాలంటోంది. అసలు నిహారికకు భర్త అవసరం లేదు, మెగా ఆడపడుచులకే భర్తలంటే గౌరవం లేదు.. ప్రేమ లేదని ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ శ్రీ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus