Sri Reddy: మెగా హీరోలలో అతనికి మాత్రమే టాలెంట్ ఉంది.. అందరూ వేస్ట్?

సంచలన తార శ్రీరెడ్డి ప్రస్తుతం ఏ సినిమాలలో చేయకపోయినా ఈమె సినీ ఇండస్ట్రీ గురించి నిత్యం ఏదో ఒక విషయం గురించి సోషల్ మీడియా వార్తల్లో నిలుస్తుంటారు. ఇకపోతే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన నరేష్, పవిత్ర లోకేష్ వ్యవహారంపై శ్రీ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఏకంగా తొడకొడుతూ నరేష్ పవిత్రను ఓ రేంజ్ లో ఆడుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ నరేష్ పవిత్ర గురించి ఈమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా శ్రీ రెడ్డి మాట్లాడుతూ నటి పవిత్ర పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు నరేష్ భార్య రమ్యను ప్రశ్నించడానికి నువ్వు ఎవరు ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి నువ్వు ఎవరు అంటూ పవిత్రను నిలదీశారు. నరేష్ గురించి మాట్లాడే అధికారం ఆమెకు ఉంది నువ్వెందుకు ఇతరుల జీవితాలలో నిప్పులు పోస్తావు అంటూ పవిత్ర పై ఆగ్రహం వ్యక్తం చేసింది. నువ్వు ఎవరితోనైనా రిలేషన్స్ పెట్టుకోవచ్చు నీవన్ని అపవిత్రమైన బంధాలే అంటూ ఘాటుగా స్పందించారు.

గతంలో మీటు ఉద్యమం చేస్తే మాకు వ్యతిరేకంగా పోరాటం చేశావు. ఇక నరేష్ నాలుగు సంవత్సరాలు నన్ను మా అసోసియేషన్ నుంచి బ్యాన్ చేశారు. ఈయన కూడా ఎంతమందితో అయినా రిలేషన్స్ పెట్టుకోవచ్చు కానీ ఎవరైనా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడి ఎదిరిస్తే వారి కెరియర్ అక్కడికే నాశనమవుతుంది. ఇలా నా కెరియర్ మొత్తం నాశనం చేశారంటూ ఈమె నరేష్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మెగా ఫ్యామిలీ ఇండస్ట్రీలో నన్ను తొక్కేసారని శ్రీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక మెగా ఫ్యామిలీలో అందరూ వేస్ట్ అని ఎవరికి టాలెంట్ లేదని శ్రీ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మెగా ఫ్యామిలీలో కేవలం అల్లు అర్జున్ మాత్రమే ఎంతో కష్టపడి పైకి వచ్చారని ఆయనకు మంచి టాలెంట్ ఉందని శ్రీరెడ్డి తెలిపారు. తనకు కనీసం అవకాశం కూడా రాకుండా చేశారని,తనని చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని నన్ను ఇబ్బంది పెట్టిన వారందరూ కూడా నాశనం అవుతారు అంటూ శ్రీ రెడ్డి ఈ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు గురించి మాట్లాడుతూ ఘాటుగా విమర్శలు చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus