Sridevi Soda Center: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’..!

సుధీర్ బాబు హీరోగా ఆనంది హీరోయిన్ గా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. ’70.ఎం.ఎం.ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగష్ట్ 27న విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, హీరో సుధీర్ బాబు ఇంట్రో టీజర్,హీరోయిన్ ఆనంది ఇంట్రో టీజర్, పాటలకు మంచి స్పందన లభించింది. యాక్షన్, ఎమోషన్, సెంటిమెంట్, రొమాన్స్..

ఇలా అన్నీ సమపాళ్లలో కలిసిన ‘శ్రీదేవి సోడా సెంటర్’ ట్రైలర్ యూ ట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా.. U/A సర్టిఫికేట్ ను జారీ చేశారు సెన్సార్ యూనిట్ సభ్యులు. సినిమా ఆద్యంతం అలరించే విధంగానే ఉందని వారు చెప్పుకొచ్చారు.టెక్నికల్ వాల్యూస్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ గా నిలిచిందని ప్రశంసించారు.మొత్తానికి సెన్సార్ యూనిట్ సభ్యుల నుండీ పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

కరోనా సెకండ్ వేవ్ తర్వాత విడుదలవుతున్న ‘శ్రీదేవి సోడా సెంటర్’ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్‌లో కూడా ఈ చిత్రం భారీగా విడుదలవుతుంది. ఈ మధ్య కాలంలో ఇంత గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న చిత్రం ఇదే కావడం విశేషం.మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి..!

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Share.