Srikanth Addala: శ్రీకాంత్‌ అడ్డాల నెక్స్ట్‌ సినిమా ఇదేనంట

Advertisement

హీరోల తనయులే కాదు… నిర్మాతల తనయులూ హీరోలు అవుతుంటారు. టాలీవుడ్‌లో ఇటీవల అలా హీరోలు అయినవాళ్లు ఉన్నారు. తాజాగా ఈ ఫ్లోలో మరో నిర్మాత తనయుడు హీరోగా మారబోతున్నాడు. ‘అఖండ’ వంటి భారీ హిట్‌ అందించిన మిర్యాల రవీందర్‌ రెడ్డి తనయుడిని హీరోగా పరిచయం చేయాలని గత కొన్ని రోజులుగా చూస్తున్నారు. ‘అఖండ’ తర్వాత వెంటనే ఆ సినిమా ఉంటుందని ఆ మధ్య వార్తలొచ్చాయి కానీ… అవి కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు పక్కాగా ప్లాన్స్‌ వేస్తున్నారట.

Click Here To Watch Now

మిర్యాల తనయుడిని హీరోగా పరిచయం చేయడానికి… గతంలో ఇంట్రడక్షన్‌ సినిమా చేసిన అనుభవం ఉన్న దర్శకుడినే చూస్తున్నారట. ఈ క్రమంలో మనకు కనిపించే పేర్లు అంటే వి.వి.వినాయక్‌.. ఆ తర్వాత శ్రీకాంత్‌ అడ్డాల. వినాయక్‌ ఇంట్రడక్షన్‌ సినిమాల మీద మంచి పట్టే ఉంది. ఇక శ్రీకాంత్‌ అడ్డాల అంటే… వరుణ్‌తేజ్‌తో ‘ముకుంద’ చేశారు. ఆ సినిమాలో వరుణ్‌ను బాడీలాంగ్వేజ్‌కి తగ్గట్టుగా చూపించారని మెచ్చుకోలు కూడా పొందారు. అందుకే తన తనయుడిని శ్రీకాంత్‌ అడ్డాల చేతిలో పెట్టాలని రవీందర్‌ రెడ్డి అనుకుంటున్నారట.

నిజానికి శ్రీకాంత్‌ అడ్డాల కెరీర్‌ అంత సాఫీగా ఏమీ లేదు. మహేష్‌బాబుతో ‘బ్రహ్మోత్సవం’ లాంటి డిజాస్టర్‌ ఇచ్చి… ఇండస్ట్రీలో పెద్ద పరాజయం మూటగట్టుకున్నాడు. బ్రహ్మాండమైన మాస్‌ ఇమేజ్‌ ఉన్న మహేష్‌తో అలాంటి కథ చేయడమేంటి అంటూ విమర్శకులతో మాటలు పడ్డాడు. ఆ తర్వాత వెంకటేశ్‌తో ‘నారప్ప’ అనే రీమేక్‌ సినిమా చేశాడు. ఆ సినిమా ఫర్వాలేదనిపించినా… శ్రీకాంత్‌ అడ్డాలకు పెద్దగా ఉపయోపగపడింది లేదు. దీంతో తర్వాతి సినిమా ఏంటి? అనే ప్రశ్న మొదలైంది.

ఆ సమయంలో అతని దగ్గర ‘అన్నాయ్‌’ అనే సినిమా ఉందని, గీతా ఆర్ట్స్‌లో ఆ సినిమా చేయాలని వార్తలొచ్చాయి. ఆ సినిమా మల్టీస్టారర్‌ అని, మంచి హిట్‌ కొట్టాక ఆ సినిమా స్టార్ట్‌ చేయాలని అనుకుంటున్నారట నిర్మాత. మరి గతంలో పరిచయంతో మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్‌.. ఈసారి హిట్‌ కొట్టి కెరీర్‌ను మళ్లీ రైట్‌ ట్రాక్‌ మీదకు తెచ్చుకుంటారా?

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus